అమెరికాకు విచ్చేసిన మెక్‌లారెన్ పి1 సూపర్ కారు

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ గడచిన మార్చ్ 2013 నెలలో జరిగిన 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శించిన సరికొతత్త 'మెక్‌లారెన్ పి1' (McLaren P1) సూపర్ హైబ్రిడ్‌కారు ఇప్పుడు అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించింది. కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ వద్ద మెక్‌లారెన్ డీలర్‌షిప్ వద్ద ఈ కారు హల్ చల్ చేస్తుంది.

ఈ సూపర్ హైబ్రిడ్ కారులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 737 హార్స్ పవర్‌ల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 179 హార్స్ పవర్‌ల శక్తిని, 260 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించారు. పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ల శక్తిని కలుపుకుంటే ఇది గరిష్టంగా 916 హార్స్ పవర్‌ల శక్తిని, 900 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ట్విన్ క్లచ్ గ్రజియానో గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

మెక్‌లారెన్ పి1 పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌పై గంటకు సగటున 48 కి.మీ. వేగంతో 20 కి.మీ. దూరం నడపవచ్చు. మెక్‌లారెన్ పి1 సూపర్‌ హైబ్రిడ్‌ కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అమెరికా ప్రవేశం

అమెరికా ప్రవేశం

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ తాజాగా అభివృద్ధి చేసిన సరికొత్త సూపర్‌కారు 'మెక్‌లారెన్ పి1' అమెరికన్ మార్కెట్లో విడుదల చేసింది.

ఇంజన్

ఇంజన్

ఈ సూపర్ హైబ్రిడ్ కారులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 737 హార్స్ పవర్‌ల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 179 హార్స్ పవర్‌ల శక్తిని, 260 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఈ ఇంజన్ 7-స్పీడ్ ట్విన్ క్లచ్ గ్రజియానో గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ధర

ధర

మెక్‌లారెన్ పి1 ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.07 కోట్లు (పన్నులు కలుపుకోకుండా).

టైర్లు

టైర్లు

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు.

బ్రేకింగ్ సిస్టమ్

బ్రేకింగ్ సిస్టమ్

ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది.

ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

సిజర్ డోర్స్

సిజర్ డోర్స్

Most Read Articles

English summary
McLaren has launched its latest hypercar P1 in United States. The first model was spotted at McLaren’s dealership in Newport Beach, California. McLaren P1 is powered by a hybrid powertrain consisting of a twin-turbo, V8 3.8-liter mid-mounted engine generating 737 HP at 7,500 rpm and 720 Nm of torque from 4,000 rpm and an electric motor adding 179 HP and 260 Nm.
Story first published: Monday, June 10, 2013, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X