మెక్‌లారెన్ పి1 హైపర్‌కారు ఉత్పత్తి ప్రారంభం

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ ఈ ఏడాది మార్చ్ 2013 నెలలో జరిగిన 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించి సరికొత్త 'మెక్‌లారెన్ పి1' (McLaren P1) సూపర్ హైబ్రిడ్‌కారు మొత్తానికి ఉత్పత్తి దశకు చేరుకుంది.

డ్యూయెల్ పవర్ (ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజన్)తో నడిచే ఈ హైపర్‌కారును కేవలం 375 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఒక్క రోజుకు కేవలం ఒక్క మెక్‌లారెన్ పి1 కారును మాత్రమే తయారు చేస్తారు.

ఈ మెక్‌లారెన్ పి1 హైపర్ కారును అమెరికా, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా విక్రయించనున్నట్లు గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ ఎక్స్‌క్లూజివ్ కారు భారత మార్కెట్లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మెక్‌లారెన్ పి1 హైపర్‌కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇంజన్

ఇంజన్

ఈ సూపర్ హైబ్రిడ్ కారులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 737 హార్స్ పవర్‌ల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 179 హార్స్ పవర్‌ల శక్తిని, 260 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ఈ ఇంజన్ 7-స్పీడ్ ట్విన్ క్లచ్ గ్రజియానో గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ధర

ధర

మెక్‌లారెన్ పి1 ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.07 కోట్లు (పన్నులు కలుపుకోకుండా).

టైర్లు

టైర్లు

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు.

బ్రేకింగ్ సిస్టమ్

బ్రేకింగ్ సిస్టమ్

ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది.

ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

Most Read Articles

English summary
The testing programme for the McLaren P1 has continued at a relentless pace throughout the summer, and in the latest short film from McLaren Automotive, the production-intent McLaren P1 is shown testing in some of the harshest and most challenging conditions.
Story first published: Tuesday, October 8, 2013, 16:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X