మెక్‌లారెన్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ కారు 'పి13' డిటేల్స్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ స్పోర్ట్ కార్ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఈ సెగ్మెంట్లో లభిస్తున్న పోర్షే 911, జాగ్వార్ ఎఫ్-టైప్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా కంపెనీ సరికొత్త స్పోర్ట్స్ కారును తయారు చేస్తోంది. ఈ కారుకు 'మెక్‌లారెన్ పి13' (McLaren P13) అనే పేరును ఖరారు చేశారు.
ప్రస్తుత మెక్‌లారెన్ అందిస్తున్న ఎమ్‌పి4-12సి కారుకు దిగువన ఈ మెక్‌లారెన్ పి13 కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ కొత్త మెక్‌లారెన్ పి13 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ కారుకు సంబంధించి అఫీషియల్ స్కెచ్‌ను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే, మెక్‌లారెన్ పి1 హైపర్‌కారు డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది కొత్త 2015 మెక్‌లారెన్ పి13 స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెక్‌లారెన్ పి13 స్పోర్ట్స్ కారును కంపెనీ డిజైన్ ఛీఫ్ ఫ్రాంక్ స్టీఫెన్సన్ డిజైన్ చేశారు. డిజైన్ విషయంలో పి1 కారుపై ఆధారపడగా, ఇంజన్ విషయంలో ఎమ్‌పి4-12సి కారుపై ఆధారపడనున్నారు. మెక్‌లారెన్ పి13 కారులో ఎమ్‌పి4-12సిలో ఉపయోగించిన 3.8 లీటర్, ట్విన్ టర్బో ఇంజన్ ట్యూనింగ్‌ను తగ్గించి ఉపయోగించనున్నారు. ఇది 444 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనుంది (ఎమ్‌పి4-12సిలో ఇది 616 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది).
మెక్‌లారెన్ కార్భన్ ఫైబర్ మోనోసెల్ ఛాస్సిస్‌పై పి13 కారును నిర్మించనున్నారు. ఎమ్‌పి4-12సి, పి1 కార్ల తయారీలో కూడా ఇదే ఛాస్సిస్‌ను ఉపయోగించారు, అయితే దీనిని మోనోకేజ్ అని పిలుస్తున్నారు. మెక్‌లారెన్ పి13 2015లో మార్కెట్లోకి రానుంది. ప్రారంభ సంవత్సరంలో 2500 యూనిట్ల పి13 కార్లను విక్రయించగలమని మెక్‌లారెన్ అంచనా వేస్తోంది.

దీన్నిబట్టి చూస్తుంటే, సరమైన ధరకే మెక్‌లారెన్ పి13 కారు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. దీని ధర ఎమ్‌పి4-12సి కన్నా 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండొచ్చని అంచనా (సుమారు 1,97,000 డాలర్లు). ప్రారంభంలో భాగంగా కూపే వెర్షన్ మెక్‌లారెన్ పి13 స్పోర్ట్స్ కారును విడుదల చేస్తారు. ఆ తర్వాత ఇందులో ఓ కన్వర్టిబల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది జరగనున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2015లో దీనిని వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications









