బహ్రైన్ ఇంటర్నేషనల్ రేస్ ట్రాక్‌పై మెక్‌లారెన్ పి1 ఫొటోషూట్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ 'మెక్‌లారెన్' ఇటీవల జరిగిన 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించిన సరికొత్త సూపర్‌కారు 'మెక్‌లారెన్ పి1' గుర్తుందా..? మనం ఇలాంటి అత్యంత ఖరీదైన ఆల్ట్రా ఎక్స్‌క్లూజివ్ ఎగ్జోటిక్ కార్లను సొంతం చేసుకోలం కాబట్టి, కనీసం ఈ కారు ఫొటోలను చూసైనా ఆనందించండంటూ, మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు సంబంధించిన తాజా ఫొటోలను విడుదల చేసింది. మెక్‌లారెనో ఈ ఫొటోలను బహ్రైన్‌లోని అంతర్జాతీయ రేస్ సర్క్యూట్‌లో షూట్ చేసింది. మరి ఆ అందాలను మనం కూడా చూసేద్దామా..!
మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు. కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేయనుంది.

దీని ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే (పన్నులు కలుపుకోకుండా). ఇందులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 903 బిహెచ్‌పిల శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు. ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది. ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

Click it and Unblock the Notifications