బి-క్లాస్ డీజిల్ విడుదల, ధర రూ.22.6 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న బి-క్లాస్ సిరీస్‌లో ఓ డీజిల్ వెర్షన్‌ను కంపెనీ నేడు (జులై 11, 2013) మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటి వరకు బి-క్లాస్ కేవలం పెట్రోల్ వెర్షన్లో మాత్రమే లభ్యమయ్యేది. కంపెనీ ఇప్పుడు ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ బి-క్లాస్ డీజిల్ కారును ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీ అభయ్ డియోల్ కూడా హాజరయ్యారు. బి-క్లాస్ డీజిల్ కేవలం ఒక్క (బి180 సిడిఐ స్టైల్) వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు సమర్థంవంతంగా ఉండేలా కంపెనీ ఈ కారును తీర్చిదిద్దింది.

అయితే, బి-క్లాస్ పెట్రోల్ స్పోర్ట్ వేరియంట్లో లభించే కొన్ని లగ్జరీ ఫీచర్లు మాత్రం ఈ బి180 సిడిఐ స్టైల్ డీజిల్ వేరియంట్లో లభించవు. మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుల చేసిన ఏ-క్లాస్ డీజిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ కొత్త బి-క్లాస్ డీజిల్‌లోను ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 108 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త బి-క్లాస్ డీజిల్ లీటరుకు 20.06 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్ ధర రూ.22.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








