మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఎడిషన్ 1, బి-క్లాస్ ఎడిషన్ 1 విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లలో 'ఎడిషన్ 1' (Edition 1) పేరిట రెండు సరికొత్త మోడళ్లను నేడు (జూన్ 24, 2014) దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ వీటిలో స్పెషల్ ఎడిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెగ్యులర్ ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లతో పోల్చకుంటే, ఈ ఎడిషన్ 1 మోడళ్లలో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఎడిషన్ 1 కేవలం ఏ 180 సిడిఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. అలాగే, మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎడిషన్ 1 కేవలం బి 180 సిడిఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. అంటే, ఈ ఎడిషన్ 1 మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్లలో మాత్రమే లభ్యం కానున్నాయన్నమాట. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* ఏ-క్లాస్ ఎడిషన్ 1 : రూ.26.17 లక్షలు
* బి-క్లాస్ ఎడిషన్ 1 : రూ.28.75 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఎడిషన్ 1 ఏ-క్లాస్, బి-క్లాస్ విడుదల

తర్వాతి స్లైడ్‌లలో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఎడిషన్ 1, బి-క్లాస్ ఎడిషన్ 1 మోడళ్లలో లభించే ఫీచర్లు, తదితర వివరాలను తెలుసుకోండి.

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ఫీచర్లు

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ఫీచర్లు

* ట్రెమోలైట్ గ్రే 17 ఇంచ్ 5 డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్

* గ్లాసీ బ్లాక్ ఫినిష్డ్ ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్

* ఎడిషన్ 1 డెకాల్స్ (స్పెషల్ బాడీ గ్రాఫిక్స్)

* ఇండియన్ రోడ్స్ కోసం కంఫర్ట్ సస్పెన్షన్

* ఈకో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్

* పానరోమిక్ సన్‌రూఫ్

* ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్

* రియర్ సీట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

* రివర్స్ కెమెరా

బి-క్లాస్ ఎడిషన్ 1 ఫీచర్లు

బి-క్లాస్ ఎడిషన్ 1 ఫీచర్లు

* మాల్ట్ బ్లాక్ హై గ్లాసీ 18 ఇంచ్ 5-ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్

* ఎడిషన్ 1 డెకాల్స్ (స్పెషల్ బాడీ గ్రాఫిక్స్)

* పానరోమిక్ సన్‌రూఫ్

* ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్

* రియర్ సీట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

* రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్

* రివర్స్ కెమెరా

* కొత్త జూపిటర్ రెడ్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

ఎడిషన్ 1 మోడళ్లు కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తాయి. ఇందులో పెట్రోల్ ఆప్షన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్ డీజిల్ వెర్షన్లలో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈ కొత్త ఎడిషన్ 1 మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు.

ఇంజన్ పెర్ఫార్మెన్స్

ఇంజన్ పెర్ఫార్మెన్స్

ఏ-క్లాస్ ఎడిషన్, బి-క్లాస్ ఎడిషన్ 1 మోడళ్లలో ఉపయోగించిన 2.2 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కి.మీ.

మైలేజ్

మైలేజ్

* మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్ల సగటు మైలేజ్ 19 కెఎమ్‌పిఎల్.

* ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 50 లీటర్లు.

* ఫుల్ ట్యాంక్‌పై సుమారు 1000 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

100 యూనిట్లు మాత్రమే

100 యూనిట్లు మాత్రమే

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఎడిషన్ 1 మోడల్ 100 యూనిట్లు మరియు మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎడిషన్ 1 మోడల్ 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర

* ఏ-క్లాస్ ఎడిషన్ 1 : రూ.26.17 లక్షలు

(ఎక్స్-షోరూమ్, ముంబై)

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర

ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర

* బి-క్లాస్ ఎడిషన్ 1 : రూ.28.75 లక్షలు

(అఎక్స్-షోరూమ్, ముంబై)

ఎడిషన్ 1 ఏ-క్లాస్, బి-క్లాస్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఇంటీరియర్ లుక్.

ఎడిషన్ 1 ఏ-క్లాస్, బి-క్లాస్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఇంటీరియర్ లుక్.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2014, 15:04 [IST]
English summary
Mercedes-Benz has launched the Edition 1 of the A-class and B-class in India to celebrate the first year of success of this hatchback models. The A-class and B-class special editions have been priced at Rs 26.17 lakh and Rs 28.75 lakh (all prices ex-showroom, Mumbai) respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+