బ్యాటరీ పవర్‌తో నడిచే మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

By Ravi

ప్రస్తుతం లగ్జరీ కార్ కంపెనీల మధ్య ఎలక్ట్రిక్ కార్ల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా తమ చిన్ని ఎలక్ట్రిక్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐ3 (BMW i3)ని మార్కెట్లో ప్రవేశపెట్టిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ త్వరలోనే మెర్సిడెస్ బెంజ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారుకు చెక్ పెట్టే విధంగా జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా ఓ కాంపాక్ట్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న బి-క్లాస్ కారును ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ధి చేయనుంది.

వచ్చే ఏడాది ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మార్కెట్లోకి రానుంది. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

డైమ్లర్ ఆర్ అండ్ డి హెడ్ థామస్ వెబర్ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి వివరిస్తూ, ఇది 5-డోర్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా కాకుండా, ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుందని, బ్యాటరీని నిక్షిప్తం చేయటం వలన అలాగే 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించడం వలన ఇలా అనిపిస్తుందని అన్నారు.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారులో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉంటే, తమ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌లో ఐదు సీట్లు ఉంటాయని, అలాగే రియల్ వరల్డ్‌లో ఇది సింగిల్ చార్జ్‌పై 200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని ఆయన చెప్పారు. (బిఎమ్‌డబ్ల్యూ ఐ3 190 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది).

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

దీని గరిష్ట వేగం కూడా బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారు గరిష్టం వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ3 గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే, బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్ గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 7.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ ఐ3లోని ఎలక్ట్రిక్ మోటార్లు 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. దీని ధరను ఇంకా నిర్ణయించలేదని, అయితే ధరను మాత్రం పోటీతత్వంగానే ఉంచుతామని వెబర్ అన్నారు.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్ 2014లో అమెరికా, యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. అయితే, భారత్ వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి సరైన మౌళిక వసతులు లేని నేపథ్యంలో, ఇవి ఇప్పట్లో మన దేశ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 15, 2013, 17:34 [IST]
English summary
It is yet to be determined how successful the BMW i3 electric small car, launched a few months back, will be in the real world. On paper though, the car seems very impressive. Also, come 2014 the i3 will receive heat from arch rival Mercedes-Benz's B-Class electric drive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+