మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల: ధర, ఫీచర్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సెడెస్ బెంజ్ ఇండియా, గడచిన సంవత్సరం నవంబర్ నెలలో దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ సి-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో డీజిల్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నేడు (ఫిబ్రవరి 11, 2015) కంపెనీ తమ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సి200 సిడిఐ ప్రారంభ ధర రూ.39.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా.. ఈ కొత్త సి-క్లాస్ డీజిల్‌తో పాటుగా కంపెనీ స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన పెట్రోల్ వెర్షన్ సి-క్లాస్ మోడల్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది. ఈ పెట్రోల్ మోడల్‌ను స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం కారణంగా, దీని ధర రూ.40.9 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు దిగొచ్చింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ లగ్జరీ కార్ ఎస్-క్లాస్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది, కొత్త లైట్‌వెయిట్ మాడ్యులర్ రియర్-డ్రైవ్ ఎమ్ఆర్ఏ (మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై సి-క్లాస్ కారును తయారు చేశారు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన కారణంగా, ఇది మునుపటి వెర్షన్ కన్నా తేలికగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇందులో ఇంటీరియర్ స్పేస్ అధికంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మొత్తం 4686 మి.మీ. పొడవును 1810 మి.మీ. వెడల్పును మరియు 1442 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. మునుపటి వెర్షన్ సి-క్లాస్‌తో పోల్చి చూస్తే ఇది 95 మి.మీ. ఎక్కువ పొడవును, 40 మి.మీ. ఎక్కువ వెడల్పును మరియు 5 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త సి-క్లాస్ వీల్‌బేస్ 2840 మి.మీ., మునుపటి వెర్షన్ కన్నా ఇది 80 మి.మీ. అధికం.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సి220 సిడిఐ డీజిల్ మొత్తం రెండు వేరియంట్లలో (స్టైల్, అవాంట్‌గార్డ్) లభ్యం కానుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

ఇందులో 2143సీసీ, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ కేవలం 7.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 233 కిలోమీటర్లు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, సి-క్లాస్ డీజిల్ లీటరుకు 19.27 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా అధికమని కంపెనీ తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

ప్రస్తుతానికి సి-క్లాస్ డీజిల్ వెర్షన్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అయితే, వచ్చే ఏడాది నాటికి ఈ డీజిల్ వెర్షన్‌ను కూడా పెట్రోల్ వెర్షన్ సి-క్లాస్ మాదిరిగానే ఇండియాలో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

అడాప్టివ్ మెయిన్ బీమ్ అసిస్ట్ ప్లస్‌తో కూడిన ఫుల్ ఎల్ఈడి ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్‌ను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-సేఫ్, అటెన్షన్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్‌పి, ఏఎస్ఆర్, బిఏఎస్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల

సి-క్లాస్ డీజిల్ వేరియంట్లు ధరలు

సి220 సిడిఐ స్టైల్ - రూ.39.90 లక్షలు

సి220 సిడిఐ అవాంట్‌గార్డ్ - రూ.42.90 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2015, 14:31 [IST]
English summary
Mercedes-Benz India has just launched the diesel version of its C-class luxury sedan, C 220 CDI starting at Rs 39.9 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+