మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి విడుదల; ధర రూ.68.5 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తాజాగా మరో సరికొత్త పెర్ఫామెన్స్ వెర్షన్ ఏఎమ్‌జి బ్రాండెడ్ కారును ప్రవేశపెట్టింది. 'మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి' (Mercedes Benz CLA 45 AMG) పేరిట కంపెనీ కొత్త మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. భారతదేశంలో లభిస్తున్న ఏఎమ్‌జి ట్యూన్డ్ కార్లలో కెల్లా ఇదే అతి చిన్న కారు కావటం విశేషం.
ఇది కూడా చదవండి: పోర్షే మకన్ విడుదల
ఇతర ఏఎమ్‌డి ట్యూన్డ్ మెర్సిడెస్ బెంజ్ కార్లతో పోల్చుకుంటే ఈ కొత్త సిఎల్ఏ 45 ఏఎమ్‌జి విభిన్నమైనది. ఇందులో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, డైరెక్ట్ ఇంజక్షన్ మరియు ట్విన్-స్క్రాల్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 355 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి ధరను రూ.68.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి మోడల్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ ఇంజన్‌ను కొత్తగా అభివృద్ధి చేశారు. దీని టార్క్ (45.9 కెజిఎమ్ లేదా 450 ఎన్ఎమ్) లోని 45 అంకెను అనుసరించి ఈ మోడల్‌కి సిఎల్ఏ 45 ఏఎమ్‌జి అనే పేరును పెట్టారు.

ఈ కారులోని 2.0 లీటర్ ఇంజన్ పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఇది గరిష్టంగా 355 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఉపయోగించిన మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మంచి ఆఫ్-రోడ్, ఆన్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి కేవలం 4.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ఇక ఈ కారు లుక్ విషయానికి వస్తే, ఇది మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ హ్యాచ్‌బహ్యాక్‌కు సెడాన్ వెర్షన్‌గా అనిపిస్తుంది. కానీ, నేరుగా చూసినప్పుడు హెడ్‌లైట్స్ కాస్తంత భిన్నంగా అనిపిస్తాయి.

ఈ కారులో నాలుగు ఫ్రేమ్‌లెస్ డోర్లు ఉన్నప్పటికీ, దీని ఆర్క్డ్ రూఫ్‌లైన్ వలన ఇది చూడటానికి కూపే మాదిరిగా కనిపిస్తుంది.

వెనుక బంపర్ క్రింది భాగంలో ఉండే డిఫ్యూజర్, పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ బంపర్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్‌లన్నీ కూడా ఏఎమ్‌జి డిఎన్ఏని ప్రతిభింభింపజేస్తాయి.

ఇంటీరియర్స్ గమనిస్తే, ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌లోని డ్యాష్‌బోర్డునే సిఎల్ఏ 45 ఏఎమ్‌జి లోను ఉపయోగించారు. సీట్ కవర్స్‌పై రెడ్ స్టిచింగ్, రెడ్ కలర్ సీట్‌బెల్ట్స్, హీటెడ్ అండ్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్‌తో అనేక విలాసవంతమైన ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








