మెర్సిడెస్ బెంజ్ ఇండియా నుంచి అత్యంత చవకైన కారు విడుదల

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో ఓ సరికొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'సిఎల్ఏ-క్లాస్' (CLA-Class)ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ఆడి అందిస్తున్న ఏ3 సెడాన్‌కు గట్టి పోటీనిచ్చేలా మెర్సిడెస్ తమ సిఎల్ఏ-క్లాస్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో 'మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్' మూడు వేరియంట్లు, రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* సిఎల్ఏ 200 సిడిఐ స్టైల్ - రూ.31.50 లక్షలు
* సిఎల్ఏ 200 సిడిఐ స్పోర్ట్ - రూ.35.90 లక్షలు
* సిఎల్ఏ 200 స్పోర్ట్ (పెట్రోల్) - రూ.35.00 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌‌లో తెలుసుకోండి.

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ

తర్వాతి స్లైడ్‌లలోమెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ

మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఏ-క్లాస్, బి-క్లాస్, జిఎల్ఏ క్లాస్ మోడళ్ల మాదిరిగానే సిఎల్ఏ క్లాస్‌ను ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎమ్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ ఆధారంగా డిజైన్ చేశారు. జిఎల్ఏ క్రాసోవర్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ సిఎల్ఏ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు.

పెట్రోల్ ఇంజన్ డిటేల్స్

పెట్రోల్ ఇంజన్ డిటేల్స్

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్ పెట్రోల్ వెర్షన్‌లో 2.0 లీటర్, టర్బో ఇంజన్ (సిఎల్ఏ 200)ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 181 హెచ్‌పిల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజన్ డిటేల్స్

డీజిల్ ఇంజన్ డిటేల్స్

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్ డీజిల్ వెర్షన్‌లో 2.2 లీటర్ ఇంజన్ (సిఎల్ఏ 200 సిడిఐ)ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 134 హెచ్‌పిల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

* పెట్రోల్ వెర్షన్ 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోటవానికి 7.8 సెకండ్ల సమయం పడుతుంది.

* డీజిల్ వెర్షన్ 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోటవానికి 9.8 సెకండ్ల సమయం పడుతుంది.

* గరిష్ట వేగం గంటకు 235 కిలోమీటర్లు.

స్మార్ట్ ఫీచర్లు

స్మార్ట్ ఫీచర్లు

టాప్-ఎండ్ వేరియంట్ సిఎల్ఏ మోడల్‌లో వర్షం పడటాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయ్యే పానోరమిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ హాట్‌స్పాట్ ద్వారా ఆన్-బోర్డ్ వెబ్ బ్రౌజింగ్, నావిగేషన్ సిస్టమ్, ప్రీమియం హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, రివర్సింగ్ కెమెరా వంటి స్మార్ట్ ఫీచర్లున్నాయి.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న ఈ మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ క్లాస్ కారులో లభించే సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* ఎయిర్‌బ్యాగ్స్

* ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

* ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)

* హిల్ హోల్డ్

* యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్‌సి)

* అడాప్టివ్ బ్రేకింగ్

ధరలు

ధరలు

* సిఎల్ఏ 200 సిడిఐ స్టైల్ - రూ.31.50 లక్షలు

* సిఎల్ఏ 200 సిడిఐ స్పోర్ట్ - రూ.35.90 లక్షలు

* సిఎల్ఏ 200 స్పోర్ట్ (పెట్రోల్) - రూ.35.00 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, January 22, 2015, 14:44 [IST]
English summary
German luxury carmaker Mercedes Benz has just launched the much awaited CLA sedan in India with the starting price of Rs 31.5 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+