2014 మోడల్ 'మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ 350' విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సిఎల్ఎస్ 350 మోడల్‌లో 2014 ఎడిషన్‌ను నేడు (జులై 1, 2014) మార్కెట్లో విడుదల చేసింది. రెగ్యులర్ వెర్షన్ సిఎల్ఎస్ 350 కన్నా ఈ 2014 ఎడిషన్‌ను మరింత స్టయిలిష్‌గా తీర్చిదిద్దారు. దీని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో మార్పులు చేర్పులు ఉన్నాయి.
ఎక్స్టీరియర్స్
డైమండ్ సిల్వర్ కలర్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్, 15 స్పోక్ డిజైన్‌తో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ గార్నిష్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, స్మైలీ షేప్ ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ మొదలైన మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంటీరియర్స్
ప్లష్ అండ్ స్పేసియస్ ఇంటీరియర్, త్రీడి డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ షిఫ్ట్ ప్యాడల్స్‌తో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, మూడ్‌కు తగినట్లుగా మార్చుకునే ఇంటీరియర్ లైటింగ్, స్లైడింగ్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇంకా ఇందులోని హార్మన్ కార్డన్ లాజిక్ 7 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 14 హైపెర్ఫార్మెన్స్ స్పీకర్లు, ఓ సబ్‌వూఫర్, 9-ఛానెల్ డిఎస్‌పి ఆంప్లిఫయర్‌తో కూడిన 610 వాట్ డాల్బీ డిజిటల్ 5.1 సిస్టమ్ బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.
ఫీచర్స్
ఎయిర్‌మ్యాటిక్ సస్పెన్షన్‌తో కూడిన మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ 350 మంచి రైడ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. పార్కింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఇందులో యాక్టివ్ పార్క్ అసిస్ట్ అనే ఫీచర్‌ను జోడించారు. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లలో ఉండే సెన్సార్లు కారు చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని సెన్స్ చేసి ఆడియో, వీడియో వార్నింగ్స్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.

ఇంజన్
మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ 350 కారులో 3498సీసీ, వి-6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 370 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
ధర
భారత మార్కెట్లో 2014 మోడల్ ఇయర్ మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ 350 లగ్జరీ కారు ధర రూ.89.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెర్సిడెస్ బెంజ్ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో ఇది లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








