మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి విడుదల; వివరాలు

By Ravi

ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ-క్లాస్ లగ్జరీ కారును భారత విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా, తాజాగా ఈ-క్లాస్ సిరీస్‌లో ఓ పెర్ఫామెన్స్ వెర్షన్‌ను విపణిలో ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన పెర్ఫామెన్స్ విభాగం ఏఎమ్‌జితో కలిసి అభివృద్ధి చేసిన 'ఈ63 ఏఎమ్‌జి' వేరియంట్‌ను నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ విడుదల చేసింది.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి వేరియంట్ ధర రూ.1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ కారులో శక్తివంతమైన 5.5 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 557 బిహెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ ఎమ్‌సిటి 7జి-ట్రానిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సిబియూ యూనిట్

సిబియూ యూనిట్

మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.

ఇంజన్

ఇంజన్

ఈ కారులో శక్తివంతమైన 5.5 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 557 బిహెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఈ ఇంజన్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ ఎమ్‌సిటి 7జి-ట్రానిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం 4.2 సెకండ్ల వ్యవధిలోనే గరిష్టంగా గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

హ్యాండ్ మేడ్ ఇంజన్

హ్యాండ్ మేడ్ ఇంజన్

మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి కారులో ప్రధానంగా చెప్పుకోదగిన ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉపయోగించిన ఇంజన్‌ను పూర్తిగా చేతుల్తో తయారు చేశారు.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

ట్రేడ్‌మార్క్ ఏఎమ్‌జి ఏ వింగ్ డిజైన్‌ను ఈ కారు ముందువైపు గమనించవచ్చు. ట్విన్ ఎయిర్‌స్ప్లిట్టర్, ట్విన్ బ్లేడ్ మౌంటెడ్ మెర్క్ లోగో, ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త డిజైన్‌ను తలపిస్తుంది.

ఏఎమ్‌జి స్పోర్ట్స్ సైలెన్సర్

ఏఎమ్‌జి స్పోర్ట్స్ సైలెన్సర్

ఏఎమ్‌జి ట్యూన్ చేసిన మోడల్ కావటంతో, మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి కారులో స్పోర్టీయర్ సైలెన్సర్‌ను ఉపయోగించారు. వెనకవైపు బంపర్‌లో అమరినట్లు ఉండే ఈ ప్రత్యేక సైలెన్సర్ డిజైన్ ఈ కారులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్

లగ్జరీ ఇంటీరియర్

ప్రీమియం నప్పా లెథర్, అల్కాంట్రా కవరింగ్‌తో పూర్తి బ్లాక్ థీమ్డ్ క్యాబిన్ రిచ్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఏఎమ్‌జి స్పోర్ట్స్ సీట్స్, స్టీరింగ్ వీల్స్ ఓ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతిని కల్పిస్తాయి.

అధునా సేఫ్టీ ఫీచర్లు

అధునా సేఫ్టీ ఫీచర్లు

అన్ని మెర్సిడెస్ బెంజ్ కార్లలో లభించే కామన్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, అటెన్షన్ అసిస్ట్, కొలైషన్ ప్రివెన్షన్ అసిస్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యమవుతాయి.

'ఈ63 ఎస్‌'ను విడుదల చేయలేదు

'ఈ63 ఎస్‌'ను విడుదల చేయలేదు

మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జిలో అత్యంత శక్తివంతమైన వేరియంట్ అయిన 'ఈ63 ఎస్'ను భారత మార్కెట్లో విడుదల చేయలేదు.

భారత్‌లో ధర

భారత్‌లో ధర

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి వేరియంట్ ధర రూ.1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2013, 16:10 [IST]
English summary
Its here. The 2014 Mercedes E 63 AMG performance sedan, one of the most powerful sedan on offer by the brand with the three pointed star. The E 63 AMG is priced at INR 1.29 crores (ex-showroom, Delhi). The company will offer the E 63 AMG in India as a CBU, which explains the whopping price tag. The more powerful E 63 AMG S trim has not been introduced in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+