మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6 స్టాక్ ఖాలీ!
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ గడచిన మార్చ్ 2013లో ఆవిష్కరించిన సిక్స్-వీల్ డ్రైవ్ (6x6) 'మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6' అప్పుడే అమ్ముడుపోయినట్లు సమాచారం. వాస్తవానికి మెర్సిడెస్ బెంజ్ ఈ మోడల్‌ను తొలుత కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శనకు ఉంచింది. అయితే, ఈ మోడల్‌కి అశేష ఆదరణ లభించడంతో, దీనిని ఉత్పత్తి దశకు తీసుకువెళ్లలాని నిర్ణయించింది.
అయితే, ఇంతలోపే మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6 మోడల్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం దీనిని ఉత్పత్తిని కొన్ని యూనిట్లకే పరిమితం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకూ కంపెనీ ఎన్ని యూనిట్ల జి63 ఏఎమ్‌జి 6x6 వాహనాలను ఉత్పత్తి చేసిందో సరిగ్గా తెలియదు కానీ, అప్పుడే ఈ మోడల్‌కు నో-స్టాక్ బోర్డ్ పెట్టేశారు.
ఈ విశిష్టమైన సిక్స్-వీల్ డ్రైవ్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6 గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి..!

మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న జి-సిరీస్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ డబుల్ క్యాబిన్ సిక్స్-వీల్ డ్రైవ్ పికప్ వేరియంట్‌ను తయారు చేశారు.

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6లో 5.5 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 544 హార్స్‌పవర్‌ల శక్తిని, 760 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

పేరుకు తగినట్లుగానే మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6లో ఆరు చక్రాలు ఉంటాయి. ఇందులోని ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి ఆరు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.

ఇందులో మూడు సెట్ల పోర్టల్ యాక్సిల్స్ ఉంటాయి, వీటి వలన ఈ వాహనం 15.75 ఇంచ్‌ల గ్రౌండ్ క్లయరెన్స్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 8.25 ఇంచ్‌లు మాత్రమే.

ప్రత్యేకించి కొండలు, గుట్టలు, ఎడార్లు వంటి ఆఫ్-రోడింగ్ ప్రయాణాల కోసం కంపెనీ ఈ వాహనాన్ని తీర్చిదిద్దింది.

వాగులు వంకలు వంటి నీటి దారుల్లో ప్రయాణించేందుకు, ఈ వాహనంలో అమర్చిన హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో వాహనాన్ని నేల నుంచి 40 ఇంచ్‌ల ఎత్తుకు లేపే సదుపాయం ఉంటుంది.


Click it and Unblock the Notifications








