మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్‌జి విడుదల; రూ.1.66 కోట్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 'జిఎల్ 63 ఏఎమ్‌జి'ని నేడు దేశీయ విపణిలో విడుదల చేసింది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్‌జి ఎస్‌యూవీని ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.

భారత మార్కెట్లో ఇది రెండు వెర్షన్లలో (రెగ్యులర్, ఏఎమ్‌జి) లభ్యం కానుంది ఈ సరికొత్త జిఎల్ ఏఎమ్‌జి ఎస్‌యూవీ ధర రూ.1.66 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జిఎల్ ఏఎమ్‌జి రాకతో భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న హై-పెర్ఫార్మెన్స్ ఏఎమ్‌జి మోడళ్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. కంపెనీ ఇప్పటికే సి63 ఏఎమ్‌జి, జి63 ఏఎమ్‌జి, ఈ63 ఏఎమ్‌జి మరియు ఎస్ఎల్‌కె55 ఏఎమ్‌జి మోడళ్లను అందిస్తోంది.

Mercedes Benz GL63 AMG

కాగా.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త జిఎల్63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 5.5 లీటర్ టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 549 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ శక్తి 40 శాతం ముందు చక్రాలకు, 60 శాతం వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ సుమారు 2.5 టన్నుల బరువు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్ 7జి-ట్రానిక్ ఏఎమ్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఈ కారుకు సంబంధించి పూర్తి రివ్యూ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 15, 2014, 16:20 [IST]
English summary
About an year after launching the GL-Class SUV in India, Mercedes-Benz has brought in its more powerful, performance oriented cousin, the GL 63 AMG to the country. Priced at INR 1.66 crore (ex-showroom, Mumbai), Mercedes-Benz GL63 AMG is the most powerful SUV in its class in India, not to mention, one of the most luxurious.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+