భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 45 ఏఎమ్‌జి 4మ్యాటిక్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో నేడు (అక్టోబర్ 27, 2014) తమ సరికొత్త హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'జిఎల్ఏ 45 ఏఎమ్‌జి 4మ్యాటిక్'ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న జిఎల్ఏ క్రాసోవర్‌కు పెర్ఫార్మెన్స్ వెర్షనే ఈ కొత్త జిఎల్ఏ 45 ఏఎమ్‌జి.
మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన పెర్ఫార్మెన్స్ విభాగం ఏఎమ్‌జి ఈ కారును ట్యూన్ చేసింది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 45 ఏఎమ్‌జి కారు ధరను రూ.69.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించారు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 45 ఏఎమ్‌జి మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఇంజన్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 45 ఏఎమ్‌జి కారులో శక్తివంతమైన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు (సిఎల్ఏ 45 ఏఎమ్‌జిలోను ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు). ఈ ఇంజన్ గరిష్టంగా 355 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

4మ్యాటిక్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 45 ఏఎమ్‌జి, పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ ఏఎమ్‌జి 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇంజన్ నుంచి వెలువడే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.

పెర్ఫార్మెన్స్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 45 ఏఎమ్‌జి కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే.. కొత్త జిఎల్ఏ 45 ఏఎమ్‌జిలో కొత్త గ్రిల్, ఏఎమ్‌జి బ్యాడ్జ్, మరింత ఆకర్షనీయమైన బంపర్స్, బ్లాక్ రూప్, సైడ్ స్కర్ట్స్, రియర్ డిఫ్యూజర్, క్వాడ్ ఎగ్జాస్ట్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు.

అలాగే, ఇంటీరియర్ అప్‌డేట్స్ విషయానికి వస్తే.. కొత్త స్పోర్టీయర్ ఫ్రంట్ సీట్స్, ఫ్లాట్-బాటమ్డ్ స్టీరింగ్ వీల్, రెడ్ సీట్‌బెల్ట్స్, డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ మరియు సీట్స్‌పై రెడ్ స్టిచింగ్ వంటి మార్పులున్నాయి.

అత్యంత సరసమైన ధరకే లభిస్తున్న పెర్ఫార్మెన్స్ సెడాన్ సిఎల్ఏ 45 ఏఎమ్‌జి మాదిరిగానే, జిఎల్ఏ 45 ఏఎమ్‌జి కూడా అత్యంత సరసమైన ధరకే లభ్యమవుతున్న ఎస్‌యూవీ.

ధర
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 45 ఏఎమ్‌జి కారు ధరను రూ.69.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








