మెర్సిడెస్ బెంజ్ ఇండియాతో లగ్జరీ పండుగ చేసుకోండి!

By Ravi

విలాసవంతుల కోసం ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ లగ్జరీ పండుగను తీసుకొచ్చింది. 'మెర్సిడెస్ బెంజ్ లగ్జ్‌ఫెస్ట్' (LuxeFest) పేరిట కంపెనీ పరిచయం చేసిన ఈ సరికొత్త క్యాంపైన్‌లో అనేక లగ్జరీ బ్రాండ్‌లో ఒకే గూటి క్రిందకు చేరనున్నాయి. కస్టమర్లు మెర్సిడెస్ బెంజ్ కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్‌తో పాటుగా వారి ఓవరాల్ లగ్జరీ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత పెంచేలా ఈ లగ్జరీ పండుగ ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి : మెర్సిడెస్ బెంజ్ మర్చండైస్

మెర్సిడెస్ బెంజ్ లగ్జ్‌ఫెస్ట్ 2014లో భాగంగా, జెడబ్ల్యూ మారియోట్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, కార్ల్ ఎఫ్. బుకెరర్ వంటి లగ్జరీ బ్రాండ్‌లు భారతదేశంలోని అన్ని మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లలో దర్శనమిస్తాయి. అంతేకాకుండా, కస్టమర్లు ఆయా లగ్జరీ బ్రాండ్‌ల ఉత్పత్తులను కూడా బెంజ్ షోరూమ్‌ల ద్వారా కొనుగోలు/బుక్ చేసుకోవచ్చు. లగ్జ్‌‌ఫెస్ట్ ఆగస్ట్ 20వ తేదీన ప్రారంభమైన అక్టోబర్ 31, 2014వ తేదీన ముగుస్తుంది.

లగ్జ్‌ఫెస్ట్ 2014 గురించి మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ మాట్లాడుతూ.. 2014 తమ ఇయర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని, ఈ ఎక్స్‌లెన్స్‌కు ప్రతీకగా తమ కస్టమర్లకు మరింత కొత్తదనాన్ని అందించే దిశలో భాగంగా మరియు మోడ్రన్ లగ్జరీ అండ్ ఇన్నోవేషన్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించాలనే ఉద్దేశ్యంతో లగ్జ్‌‌ఫెస్ట్‌ను ప్రారంభించామని, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లలో కొత్త మరియు ప్రస్తుత కస్టమర్లు మోడ్రన్ లగ్జరీని ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని అన్నారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్

లగ్జ్‌ఫెస్ట్ 2014 సమయంలో మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లను విచ్చేసే కస్టమర్లు క్రింద పేర్కొన్న లగ్జరీ అనుభూతులను పొందవచ్చు. అవేంటో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

సువాసన

సువాసన

షోరూమ్‌లలో కస్టమర్లకు ఆహ్లాదభరితమైన వాతావారణాన్ని అందించేందుకు స్టాండర్డ్ అరోమా సెంట్ యాంబీంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు.

రుచి

రుచి

షోరూమ్‌లలోని కెఫే మెర్సిడెస్ ద్వారా కస్టమర్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హై ఎండ్ కాఫీ మెషీన్లతో తయారు చేసిన స్పెషల్ కాఫీని ఆఫర్ చేయటం ద్వారా 5 స్టార్ కంఫర్ట్స్‌ను ఆఫర్ చేస్తారు.

సంగీతం

సంగీతం

కస్టమర్ల మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేలా ప్రత్యేకమైన ఆడియో ప్లేలిస్ట్‌ను అన్ని షోరూమ్‌లలో ప్లే చేస్తారు.

ఎంగేజ్‌మెంట్ ఏరియా

ఎంగేజ్‌మెంట్ ఏరియా

పిల్లలు, కుటుంబంతో పాటుగా మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లకు విచ్చే కస్టమర్ల పిల్లల కోసం కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, అలాగే కుటుంబ సభ్యులు చర్చించుకునేందుకు గాను ప్రత్యేకమైన సీటింగ్ లాంజ్ ఉంటుంది.

కార్ల్ ఎఫ్. బుకెరర్

కార్ల్ ఎఫ్. బుకెరర్

లగ్జ్‌ఫెస్ట్ 2014లో మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లలో దర్శనమివ్వనున్న ఇతర లగ్జరీ బ్రాండ్స్ గురించి..

కార్ల్ ఎఫ్. బుకెరర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్విచ్ వాచ్ బ్రాండ్. దాదాపు 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రాండ్ అథ్యుత వాచ్‌లను తయారు చేస్తుంది. ఈ క్యాంపైన్ ద్వారా ఒక విజేత అతను/ఆమె పేరుతో ఓ పర్సనలైజ్డ్ వాచ్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యాంపైన్ ముగిసేటప్పుడు అన్ని టెస్ట్ డ్రైవ్‌లకు సంబంధించిన లక్కీ డ్రా కూపన్ల ద్వారా విజేతను ఎంచుకోవటం జరుగుతుంది.

2. జె డబ్ల్యూ మారియోట్

2. జె డబ్ల్యూ మారియోట్

జె డబ్ల్యూ మారియోట్ ఒక అత్యుత ఆథిద్య (హాస్పిటాలిటీ) బ్రాండ్. ఇది తమ కస్టమర్లకు అత్యంత విలాసవంతమైన ఆథిద్యాన్ని ఆఫర్ చేస్తుంది. ఈ క్యాంపైన్‌లో గెలుపొందిన ఓ జంటకు భారతదేశంలోని ఏ జె డబ్ల్యూ మారియో ప్రాపర్టీలోనైనా, అన్ని ఖర్చులతో కూడిన 2 రాత్రులు/3 పగళ్ల ప్యాకేజీని పొందవచ్చు. దీనికి అదనంగా, మెర్సిడెస్ బెంజ్ టెస్ట్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ క్యాంపైన్ సమయంలో, ఏ జె డబ్ల్యూ మారియో ప్రాపర్టీలోనైనా ఎఫ్ అండ్ బి, స్పాల కోసం 20 శాతం బెనిఫిట్ వోచర్ పొందవచ్చు.

3. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్

3. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్

స్విస్ ఎయిర్ ఓ ప్రముఖ లగ్జరీ ఎయిర్‌లైన్స్ సంస్థ, ఇది తమ కస్టమర్లకు అత్యంత విలాసంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ క్యాంపైన్‌లో విజేతగా నిలిచే ఓ జంటకు యూరప్‌లోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ఈ ఎయిర్‌లైన్స్‌‌లో బిజనెస్ క్లాస్ ట్రావెల్ టికెట్‌ను గెలుపొందవచ్చు.

మెర్సిడెస్ బెంజ్

నవంబర్ మొదటి వారంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆఫీస్ వద్ద నిర్వహించే లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంచుకోవటం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 20, 2014, 15:48 [IST]
English summary
Mercedes-Benz India continues to fascinate customers and auto aficionados alike with the introduction of LuxeFest 2014, a luxury festival that promises to enhance the Customers overall luxury experience with Mercedes-Benz’ cutting edge innovation. Mercedes-Benz LuxeFest 2014 is a festival celebrating Modern Luxury in association with likeminded luxury Brands like J W Marriott, Swiss International Airlines, and Carl F. Bucherer across all Mercedes-Benz showrooms in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+