మేడ్ ఇన్ ఇండియా జిఎల్-క్లాస్; ధర రూ.72.58 లక్షలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, గడచిన మే నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని ఇప్పుడు స్థానికంగా భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తోంది. స్థానిక అసెంబ్లింగ్ కారణంగా ఈ ఎస్‌యూవీ కేవలం రూ.72.58 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే ఇది లభ్యమవుతోంది. ఇది వరకటి ధర రూ.77.5 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటికే భారత్‌లో ఈ-క్లాస్, ఎస్-క్లాస్, సి-క్లాస్, ఎమ్-క్లాస్ మోడళ్లను స్థానికంగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా జిఎల్-క్లాస్ ఉత్పత్తిని కూడా ఇండియాలోనే నిర్వహిస్తుండటంతో, ప్రస్తుతం కంపెనీ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న మోడళ్ల సంఖ్య ఐదుకు చేరింది. కాగా.. జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని అమెరికాలోని టుస్కలూసాలో ఉన్న మెర్సిడెస్ మాతృప్లాంట్ తర్వాత స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం ఇండియా కావటం విశేషం.


మెర్సిడెస్ బెంజ్ జిల్-క్లాస్ ఎస్‌యూవీలో బోల్డ్ గ్రిల్, ఎస్ఎల్ క్లాస్ నుంచి స్ఫూర్తి పొందిన డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ ల్యాంప్స్, ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, వుడ్ ఫినిషింగ్ ఇంటీరియర్లు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కంపెనీ అందిస్తున్న ఎమ్ఎల్ క్లాస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త జిఎల్ క్లాస్‌ను అభివృద్ధి చేశారు. ఇదివరకటి తరం జిఎల్ క్లాస్‌తో పోల్చుకుంటే ఈ 2013 జిఎల్ క్లాస్ మరింత విశాలవంతంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జిల్-క్లాస్ ఎస్‌యూవీలో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 260 పిఎస్‌ల శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. 2013 మెర్సిడెస్ బెంజ్ కేవలం 10 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

GL Class Interior

ఇంకా ఇందులో, యాక్సిలరేటర్ స్కిడ్ కంట్రోల్, డౌన్‌హిల్ స్పీడ్ రెగ్యులేషన్, క్రాస్ విండ్ అసిస్ట్ (కారు పక్కగా వేరే కారు వేగంగా వెళ్లినప్పుడు మన కారును కంట్రోల్‌లో ఉంచే ఫీచర్)లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా ఇందులో అధనపు ప్రత్యేకతలు. ఇది మూడు ఆకర్షనీయమైన రంగులలో (సిల్వర్, ఓబ్సాడియాన్, బ్లాక్) లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2013, 13:04 [IST]
English summary
Mercedes Benz India has rolled out the first locally manufactured GL-Class SUV from its Chakan plant in Pune on August 26, 2013. Locally produced GL-Class price starts at Rs 72.58 lakh, ex-showroom Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+