సిబిఐటిలో కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సెడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ సి-క్లాస్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించి సంగతి తెలిసినదే.

కాగా.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేడు, బెంగుళూరులో జరుగుతున్న 2014వ సిబిఐటి కంప్యూటర్ ఎక్స్‌పోలో తమ కొత్త సి-క్లాస్ కారును ప్రదర్శనకు ఉంచింది. ప్రపంచంలో కెల్లా అగ్రగామి ఐటి కార్యక్రమమైన సిబిఐటి నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు బెంగుళూరులో జరుగుతుంది. ఈ కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారును నవంబర్ 25వ తేదీన అధికారికంగా విపణిలో విడుదల చేయనున్నారు.


మెర్సిడెస్‌కు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సి-క్లాస్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈ ఏడాది జరిగిన 2014 డెట్రాయిట్ మోటార్ షోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ కొత్త సి-క్లాస్ కారును కొత్త లైట్‌వెయిట్ మాడ్యులర్ రియర్-డ్రైవ్ ఎమ్ఆర్ఏ (మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోని ఆడి, బిఎమ్‌డబ్ల్యూ కార్లతో తలపడుతుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మొత్తం 4686 మి.మీ. పొడవును 1810 మి.మీ. వెడల్పును మరియు 1442 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ప్రస్తుత వెర్షన్ సి-క్లాస్‌తో పోల్చి చూస్తే ఇది 95 మి.మీ. ఎక్కువ పొడవును, 40 మి.మీ. ఎక్కువ వెడల్పును మరియు 5 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త సి-క్లాస్ వీల్‌బేస్ 2840 మి.మీ., మునుపటి వెర్షన్ కన్నా ఇది 80 మి.మీ. అధికం.

2014 C Class Bangalore

మొత్తమ్మీద చూస్తే, ప్రస్తుత సి-క్లాస్ కొత్త సి-క్లాస్ మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను, కంఫర్ట్‌ను ఆఫర్ చేయనుంది. కొత్త సి-క్లాస్ ఎక్స్టీరియర్‌ను గమనిస్తే ఇది లేటెస్ట్ ఎస్-క్లాస్ మరియు రివైజ్డ్ ఈ-క్లాస్ మోడళ్లను తలపిస్తుంది. ప్రారంభంలో భాగంగా, ఇండియాలో కొత్త సి-క్లాస్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాతి కాలంలో డీజిల్ వెర్షన్లను విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 12, 2014, 14:50 [IST]
English summary
At the ongoing event at CeBIT 2014, Mercedes-Benz India has showcased their new and improved C-Class sedan in Bangalore. They have displayed their new offering to showcase their technological advancement in vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+