బడ్జెట్ ఎఫెక్ట్: మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు

By Ravi

తాజాగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2014-15లో వివిధ విభాగాల కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఉత్పత్తుల ధరలను కూడా భారీగా తగ్గించింది.

గడచిన జనవరిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు కేవలం ఇండియాలోనే 54 శాతం వృద్ధి చెందాయి. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో మెర్సిడెస్ బెంజ్, భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న 13 కార్లను ప్రదర్శనకు ఉంచింది.

అలాగే రెండు కొత్త కార్లను (సిఎల్ఏ 45 ఏఎమ్‌జి, ప్రొడక్షన్ రెడీ జిఎల్ఏ) కూడా ఈ ఆటో ఎక్స్‌లో కంపెనీ ఆవిష్కరించింది. అంతేకాకుండా, హై సెక్యూరిటీ వెహికల్ కోరుకునే వారి కోసం కంపెనీ సాయుధ ఎమ్-క్లాస్ (అలియాస్ ఎమ్-గార్డ్)ను కూడా విడుదల చేయటం జరిగింది. విఐపిల కోసం తయారు చేసిన ఈ కారు ధర రూ.2.49 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

సరే ఇదంతా అటుంచి, మెర్సిడెస్ బెంజ్ ఏయే కార్లపై ఎంత మేర ధరలను తగ్గించిందో తెలుసుకుందాం రండి..!

మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు

యూనియన్ బడ్జెట్ 2014-15లో కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా విక్రయిస్తున్న సి-క్లాస్, ఈ-క్లాస్, జిఎల్-క్లాస్ వంటి కార్ల ధరలను భారీగా తగ్గించింది.

మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు

తాజా తగ్గింపుతో సి-క్లాస్ ధర రూ.39.90 లక్షల నుంచి రూ.39.35 లక్షలకు దిగొచ్చింది (సి220 వేరియంట్ గ్రాండ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర).

మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు

ఈ-క్లాస్ ధర 47.66 లక్షల నుంచి రూ.46.90 లక్షలకు దిగొచ్చింది (ఈ250 సిడిఐ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర).

మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు

మెర్సిడెస్ జిఎల్-క్లాస్ ధర రూ.74 లక్షల నుంచి రూ.72 లక్షలకు దిగొచ్చింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2014, 17:49 [IST]
English summary
The luxury car manufacturer Mercedes Benz has been the No.1 choice in India for the rich and famous. With the latest budget by the F.M. of India and announcement in cut of excise taxes. The German manufacturer wants to share its joy, by slashing prices of their cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+