భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో మరొక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశీయ విపణిలో కంపెనీ అందిస్తున్న ఈ-క్లాస్ సిరీస్‌లో ఓ పెర్ఫామెన్స్ వెర్షన్‌ను మెర్సిడెస్ బెంజ్ నేడు మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీకు చెందిన పెర్ఫామెన్స్ విభాగం ఏఎమ్‌జితో కలిసి అభివృద్ధి చేసిన 'ఈ63 ఏఎమ్‌జి' వేరియంట్‌ను నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసింది.
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి వేరియంట్ ధర రూ.1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ కారులో శక్తివంతమైన 5.5 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 557 బిహెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ ఎమ్‌సిటి 7జి-ట్రానిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈ63 ఏఎమ్‌జి కారులో ప్రధానంగా చెప్పుకోదగిన ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉపయోగించిన ఇంజన్‌ను పూర్తిగా చేతుల్తో తయారు చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం 4.2 సెకండ్ల వ్యవధిలోనే గరిష్టంగా గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








