భారత్‌లో ఉత్పత్తి చేసిన ఈ-క్లాస్‌ను లాంచ్ చేసిన మెర్సిడెస్
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈనెల 25న భారత మార్కెట్లో విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ లగ్జరీ సెడాన్ ఇప్పుడు స్థానికంగా భారత మార్కట్లోనే అసెంబ్లింగ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పూనేలోని అసెంబ్లింగ్ కేంద్రం నుంచి ఉత్పత్తి మొదటి ఈ-క్లాస్ సెడాన్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ ఎబర్‌హార్డ్ హెచ్ కెర్న్ గురువారం పూనే ప్లాంటులో తయారైన తొలి ఈ-క్లాస్ కారును విడుదల చేశారు. 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ మొత్తం రెండు వేరియంట్లలో (ఈ200 సిజిఐ, ఈ250 సిడిఐ) లభ్యమవుతుంది. ఈ కారు విడుదల సందర్భంగా మొదటి 100 కస్టమర్ల కోసం ఈ250 సిడిఐ లాంచ్ ఎడిషన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతమున్న స్థాయిల్లోనే దీర్ఘకాలం కొనసాగినట్లతే, ఉత్పత్తు ధరలు పెంచాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమ హెడ్జింగ్ వ్యూహం కారణంగా రూపాయి పతనం వల్ల ఇప్పటిదాకా తమకెలాంటి ఇబ్బంది లేదని, అయితే రూపాయి ప్రస్తుతమున్న స్థాయిల్లోనే దీర్ఘకాలం కొనసాగితే, అప్పుడు ధరలు పెంచక తప్పదని ఆయన తెలిపారు.

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
ఈనెల 25న భారత మార్కెట్లో విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ లగ్జరీ సెడాన్ ఇప్పుడు స్థానికంగా భారత మార్కట్లోనే అసెంబ్లింగ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
కొత్త 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ విషయానికి వస్తే, యాక్టివ్ పార్క్ అసిస్ట్, ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్, ఈకో స్టార్ట్-స్టాప్, అటెన్షన్ అసిస్ట్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)తో కూడిన బ్రేక్ అసిస్ట్, ప్రీ సేఫ్ మరియు యాక్టివ్ బానెట్ వంటి సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
ఇంకా ఇందులో కొత్త పానరోమిక్ సన్‌రూఫ్, నాపా లెథర్ అప్‌హోలెస్ట్రీ, 3 యాంబీంట్ లైటింగ్ ఎఫెక్ట్స్, డ్యాష్‌బోర్డుపై ఓపెన్ పోర్ యాష్ ఉడ్ ఇంటీరియర్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లను లభ్యం కానున్నాయి.

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 80 లీటర్లు. పెట్రోల్ వేరియంట్ 13.75 కెఎమ్‌పిల్ మైలేజీని, డీజిల్ వేరియంట్ 17.25 కెఎమ్‌పిల్ మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్



Click it and Unblock the Notifications








