మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, భారత్‌లోని తమ ఛాకన్ ప్లాంటులో నేడు 50,000వ కారును విడుదల చేసింది. అంతేకాదు, భారతదేశంలో 50,000 కార్లను ఉత్పత్తి/అసెంబ్లింగ్ చేసిన ఏకైక విదేశీ లగ్జరీ కార్ కంపెనీ కూడా మెర్సిడెస్ బెంజ్ కావటం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెర్సిడెస్ బెంజ్ ఓ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

ప్రస్తుత జనరేషన్ సి-క్లాస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన స్పెషల్ ఎడిషనే ఈ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ (త్వరలోనే ప్రస్తుత తరం సి-క్లాస్‌ను కంపెనీ ఈ ఏడాది డెట్రాయిట్‌లో ఆవిష్కరించిన 2014 సి-క్లాస్‌తో రీప్లేస్ చేయనుంది). ఈ గ్రాండ్ ఎడిషన్ సి-క్లాస్‌లో హై-ఎండ్ మరియు ఏఎమ్‌జి ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు.


మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌కు ఏఎమ్‌జి బాడీ కిట్‌ను బిగించనున్నారు. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ యాప్రాన్స్, సైడ్ సిల్ గార్డ్స్ మరియు 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. రెగ్యులర్ సి-క్లాస్‌కు ఈ స్పెషల్ ఎడిషన్‌కు మధ్య వ్యత్యాసాన్ని చూపించేలా వెనుక వైపు గ్రాండ్ ఎడిషన్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇంకా ఇందులో సైలెన్సర్‌పై క్రోమ్ టిప్, ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్ విత్ బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్ ఫీచర్లున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ ఇంటీరియర్లలో ఎక్స్‌క్లూజివ్ బ్రష్డ్ అల్యూమినియం ట్రిమ్‌తో డిజైన్ చేసిన ఇంటీరియర్స్ మరియు 11.4 సెం.మీ. మల్టీ-ఫంక్షన్ కలర్ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ సిస్టమ్‌లో 7.9 మిలియన్ కీ పాయింట్స్‌ను (మెర్సిడెస్ బెంజ్ సర్వీస్ సెంటర్లు, రెస్టారెంట్లు మరోన్నో) లోడ్ చేయబడి ఉంటాయి. ఇందులో కొత్త పానరోమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నారు.

C Class Grand Edition

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌లో యాంత్రికపరమైన మార్పులు లేవు. సి 220 సిడిఐ వేరియంట్లో 167 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2143సీసీ టర్బో-డీజిల్ ఇంజన్ మరియు సి 200 సిజిఐ వేరియంట్లో 186 బిహెచ్‌పి పవర్, 285 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1796సీసీ , ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ సి 220 సిడిఐ - రూ.39.16 లక్షలు
* సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ సి 200 సిజిఐ - రూ.36.81 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, పూనే)

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2014, 17:09 [IST]
English summary
Mercedes-Benz today rolled out the 50,000th vehicle, a C-Class, from its Chakan manufacturing facility becoming the only foreign luxury car manufacturer in the country to do so. To celebrate reaching this milestone the German automaker launched the C-Class Grand Edition.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+