మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆటో ఎక్స్‌పో 2014 ప్లాన్స్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే కొత్త ఎస్-క్లాస్ లగ్జరీ సెలూన్‌ను భారత్‌లో విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా, 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ జిఎల్ఏ మరియు సిఎల్ఏ45 ఏఎమ్‍‌జి మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2014 ఆటో ఎక్స్‌పో అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి:
* పవర్ మరియు డిజైన్‌‌ల సమ్మేళనం సిఎల్ఏ45 ఏఎమ్‌జి పరిచయం.
* తమ తొలి ఎస్‌యూవీ గార్డ్ వెహికల్ 'ది ఎమ్ గార్డ్' విడుదల.
* మెర్సిడెస్ ఏఎమ్‌జి పెట్రోనాస్ ఎఫ్1 టీమ్ కార్ ప్రత్యేక ప్రదర్శన.
* కాన్సెప్ట్ జిఎల్ఏ ఆవిష్కరణ.


ఇవేకాకుండా.. మొట్టమొదటి సారిగా డైమ్లర్ ఏజి గ్రూపుకు చెందిన ఉన్నతాధికారి ఓలా కల్లెనియస్ (మెర్సిడెస్ బెంజ్ కార్స్ డివిజనల్ బోర్డ్ మెంబర్ మరియు వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్) ఆటోఎక్స్‌పో 2014కు విచ్చేస్తున్నారు. ఇంకా.. అభిమానుల కోరిక మేరకు ఆటో ఎక్స్‌పో పెవిలియన్ నుంచి లైవ్ 'ఆన్ డిమాండ్' వీడియోలను కూడా ప్రసారం చేయనున్నారు. ఇందుకు గూగుల్ సహకారం తీసుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.
Mercedes CLA 45 AMG

ఆటో ఎక్స్‌పో 2012 భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఎంతగానో ఎదురుచూస్తున్న కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో తమ కస్టమర్లను మరియు బ్రాండ్ ప్రియులను అలరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ వెల్లడించారు. తమ బ్రాండ్ ప్రామిస్ 'బెస్ట్ ఆర్ నథింగ్'కు ధీటుగా మోడ్రన్ లగ్జరీ, హై పెర్ఫామెన్స్, ఇన్నోవేటివ్ డిజైన్, సేఫ్టీ, ఎక్సలెన్స్‌లతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించబోతున్నామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2014, 17:07 [IST]
English summary
The much awaited Auto Expo 2014 is all set to witness the ultimate luxury experience from Mercedes-Benz India. With the successful launch of the New S-Class Mercedes-Benz India is geared up to take forward its ‘Year of Excellence’ by unveiling the dynamically styled Concept GLA and CLA45 AMG at the 12th edition of the Auto Expo. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+