మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి జిటి ఫైనల్ ఎడిషన్
మెర్సిడెస్ బెంజ్ పాపులర్ స్పోర్ట్స్ కారు ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి త్వరలోనే మార్కెట్ నుంచి కనుమరుగు కానుంది. ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కేవలం నాలుగేళ్లకే దీని ఉత్పత్తిని నిలిపివేయటం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కన్నా మరింత శక్తివంతమైన, పొడవైన, గల్ వింగ్ డోర్లు కలిగిన ఓ జిటి కారును 2015లో మెర్సిడెస్ బెంజ్ విడుదల చేయనుంది.
అయితే, గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మోడల్‌ను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించడానికి ముందుగా, కొనుగోలుదారులకు ఓ చివరి అవకాశాన్ని కల్పించేందుకు కంపెనీ ఇందులో ఫైనల్ (ఆఖరి) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇదే ఆ 'మెర్సిడెస్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్'. ఈ కారును త్వరలో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఆటో షో, టోక్యో మోటార్ షోలలో ఆవిష్కరించనున్నారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్ ఉత్పత్తిని కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. అయితే, ఇందులో గల్‌వింగ్ డోర్ వెర్షన్ మరియు కన్వర్టిబల్ వెర్షన్లు రెండూ కలిసి ఉంటాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

పెర్ఫామెన్స్ విషయంలో మార్పు ఉండబోదు. ఇదివరకటి ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జిలో ఉపయోగించిన 6.2 లీటర్ వి8 ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 583 హెచ్‌పిల శక్తిని, 650 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఫైనల్ ఎడిషన్‌లో కార్బన్ ఫైబర్ హుడ్, రియర్ వింగ్, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ స్ప్లిట్టర్స్, ఓఆర్‌విఎమ్‌లు, కొత్త బ్రేక్స్, విభిన్నమైన ఫ్రంట్ బంపర్స్, బ్లాక్డ్ అవుట్ హెడ్‌ల్యాంప్ సరౌండింగ్స్ వంటి మార్పులను చూడొచ్చు.

నాన్ గల్‌వింగ్ ఎస్ఎల్‌సి ఏఎమ్‌జి (కోడ్ నేమ్ సి190) మోడల్‌కు సక్సెసర్‌గా మెర్సిడెస్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఉండనుంది. ఇది పోర్షే 911 టర్బో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








