మేరు క్యాబ్స్ నుంచి హైదరాబాద్‌లో జినీ క్యాబ్స్ లాంచ్!
క్యాబ్ సర్వీసుల్లో మంచి పేరున్న మేరు క్యాబ్స్ తాజాగా ‘జినీ క్యాబ్స్' పేరిట తక్కువ ధరకే సేవలందించే క్యాబ్ సర్వీసులను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజల వ్యక్తిగత రవాణా అవసరం కోసం ఈ క్యాబ్ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించామని కంపెనీ అధికారులు పేర్కొన్నారు.
ఎయిర్ కండిషన్ సౌకర్యం కలిగిన జినీ క్యాబ్ సేవల్లో భాగంగా కిలోమీటరుకు రూ.16 మాత్రమే చా వసూలు చేస్తామని, అదే రాత్రివేళల్లో అయితే కిలోమీటరుకు రూ.20 వసూలు చేస్తామని వివరించారు. ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్న ప్రయాణికులు కూడా జినీ క్యాబ్స్ సేవలను ఉపయోగించుకోవచ్చు. జినీ క్యాబ్స్ కనీస చార్జీ రూ.100 మాత్రమే (గరిష్టంగా 6 కిలోమీటర్లు).
ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ ఏజెన్సీలు కనీస చార్జీ రూ.150-200 వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నగర వాసుల అత్యంత సరసమైన ధరలకే సురక్షితమైన, విశ్వసనీయ ప్రయాణ అనుభూతి అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో జీని క్యాబ్స్‌ను ప్రవేశపెడుతున్నామని వి-లింక్ గ్రూప్ ఎండీ నీరజ్ గుప్తా, మేరు క్యాబ్స్, జీని సీఈఓ సిద్ధార్థ పహ్వా తెలి పారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హైదరాబాద్‌లో నిర్వహించిన జినీ క్యాబ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ సినీతార చార్మీ కౌర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

జినీ క్యాబ్స్ కోసం ఫోర్డ్ ఫిగో, టొయోటా లివా, టాటా విస్టా వంటి కార్లను ఉపయోగించనున్నారు. ప్రారంభంలో భాగంగా, హైదరాబాద్‌లో మొదట 50 కార్లతో జీని సేవలను ఆరంభిస్తున్నామని, త్వరలోనే వీటి సంఖ్యను 500కు పెంచుతామని సిద్ధార్థ వివరించారు.

జీని క్యాబ్స్ కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, తమ వెబ్‌సైట్ ద్వారా కూడా వీటిని బుక్ చేసు కోవచ్చునని సిద్ధార్థ తెలిపారు.

జినీ క్యాబ్స్‌ను హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ సేవలను ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరిస్తామని, అలాగే లక్నో, ఇండోర్, చండీగఢ్, విశాఖపట్నం తదితర కొత్త మార్కెట్లకు చేరుకునేందుకు కూడా ఈ జినీ క్యాబ్స్ తమకు అవకాశాలను కల్పిస్తాయని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








