మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' (MINI), గడచిన సంవత్సరం నవంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మూడవ తరం (థర్డ్ జనరేషన్) మినీ కూపర్‌లో కంపెనీ తాజాగా పెట్రోల్ వెర్షన్‌ను నేడు (మార్చ్ 16, 2015) మార్కెట్లో విడుదల చేసింది.

నవంబర్ 2015లో కేవలం డీజిల్ వెర్షన్ (మినీ కూపర్ డి)ని మాత్రమే విడుదల చేశారు. కాగా.. ఇప్పుడు ఇందులో పెట్రోలె వెర్షన్ (మినీ కూపర్ ఎస్)ను విడుదల చేశారు. మినీ కూపర్ డి 3-డోర్, 5-డోర్ వెర్షన్లలో లభిస్తుంటే మినీ కూపర్ ఎస్ మాత్రం కేవలం 3-డోర్ వెర్షన్లో మాత్రమే లభిస్తుంది.

మినీ కూపర్ ఎస్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల

ఇదివరకటి మోడల్‌తో పోల్చుకుంటే ఈ థర్డ్ జనరేషన్ మినీ కూపర్ మరింత పెద్దగా, విశాలంగా ఉంటుంది. గతేడాది జరిగిన 2014 ప్యారిస్ మోటార్ షో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించారు.

మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల

మినీ కూపర్ ఎస్ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 192 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రలాకు బదిలీ అవుతుంది.

మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల

మినీ కూపర్ ఎస్ లీటరు పెట్రోల్‌కు 18.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల

మినీ కూపర్ ఎస్ కేవలం 6.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు.

మినీ కూపర్ ఎస్ డిజైన్:

మినీ కూపర్ ఎస్ డిజైన్:

రీడిజైన్డ్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, బ్లాక్ హనీకోంబ్ గ్రిల్ ప్యాటర్న్ (కూపర్ ఎస్ మాత్రమే), గ్లాసీ బ్లాక్ అల్లాయ్ వీల్స్, రియర్ ఎయిర్ అవుట్‌లెట్, ఫాగ్ ల్యాంప్స్, ఎస్ బ్యాడ్జింగ్ (కూపర్ ఎస్ మాత్రమే), రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్ (ఫుల్ ఎల్ఈడి లైట్స్ ఆప్షనల్).

మినీ కూపర్ ఎస్ ఫీచర్స్:

మినీ కూపర్ ఎస్ ఫీచర్స్:

రీవ్యాంప్డ్ డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో స్పీడో/టాక్ మీటర్స్, సరికొత్త మినీ సెంట్రల్ డిస్‌ప్లే, పెంచబడిన ఇంటీరియర్ స్పేస్, ఫోల్డబిల్ బ్యాక్‌రెస్ట్ విత్ టిల్ట్ అడ్జస్టబిలిటీ, బ్లూటూత్ హ్యాండ్స్‌ఫ్రీ ఇంటర్‌ఫేస్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్.

మినీ కూపర్ ఎస్ సేఫ్టీ ఫీచర్స్:

మినీ కూపర్ ఎస్ సేఫ్టీ ఫీచర్స్:

డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్, క్రాష్ సెన్సార్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి).

మినీ కూపర్ ఎస్ ధర:

మినీ కూపర్ ఎస్ ధర:

భారత మార్కెట్లో మినీ కూపర్ ఎస్ (3-డోర్ పెట్రోల్) ధర రూ.34.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, March 16, 2015, 16:30 [IST]
English summary
Mini Cooper S has been launched in India for a price of INR 34,65,000 ex-showroom, India. It is their most sporty version of the hatchback till date. The manufacturer provides several sporty features to make it look and feel faster.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+