ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మినీ కంట్రీమ్యాన్, పేస్‌మ్యాన్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ అందిస్తున్న కంట్రీమ్యాన్ కూపర్, పేస్‌మ్యాన్ కూపర్ మోడళ్లు ఇప్పుడు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ (4x4)తో లభ్యం కానున్నాయి. ఈ రెండు మోడళ్ల చేరికతో మినీ అందిస్తున్న ఆల్ వీల్ మోడళ్ల సంఖ్య 10కి చేరుకుంది. గతంలో టర్బోఛార్జ్‌డ్ కూపర్ ఎస్ మరియు జాన్ కూపర్ వర్క్స్ వేరియంట్లు మాత్రమే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమయ్యేవి.

ఈ ఆల్ వీల్ డ్రైవ్ కంట్రీమ్యాన్ కూపర్ మరియు పేస్‍‌మ్యాన్ కూపర్ మోడళ్లు 1.6 లీటర్, ఇన్‌లైన్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 122 హార్స్ పవర్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ 190 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ కంట్రీమ్యాన్ 11.9 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే, ఆటోమేటిక్ వేరియంట్ మినీ కూపర్ కంట్రీమ్యాన్ 11.7 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ కంట్రీమ్యాన్ గరిష్ట వేగం గంటకు 184 కిలోమీటర్లు. అలాగే, ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన ఆటోమేటిక్ వేరియంట్ మినీ కూపర్ కంట్రీమ్యాన్ గరిష్ట వేగం గంటకు 182 కిలోమీటర్లు.

మైలేజ్

మైలేజ్

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ కంట్రీమ్యాన్ లీటరుకు 14.5 కిలోమీటర్ల మైలేజీని, అలాగే, కిలోమీటరుకు 167 గ్రాముల కర్భన ఉద్ఘాలను విడుదల చేస్తుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ పేస్‌మ్యాన్ 11.8 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని, ఆటోమేటిక్ వేరియంట్ మినీ కూపర్ పేస్‌మ్యాన్ 11.6 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ పేస్‌మ్యాన్ గరిష్ట వేగం గంటకు 185 కిలోమీటర్లు. అలాగే, ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన ఆటోమేటిక్ వేరియంట్ మినీ కూపర్ పేస్‌మ్యాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.

మైలేజ్

మైలేజ్

ఆల్ వీల్ డ్రైన్ ఆప్షన్ కలిగిన మ్యాన్యువల్ వేరియంట్ మినీ కూపర్ పేస్‍‌మ్యాన్ లీటరుకు 14.5 కిలోమీటర్ల మైలేజీని, అలాగే, కిలోమీటరుకు 167 గ్రాముల కర్భన ఉద్ఘాలను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2013, 11:15 [IST]
English summary
Mini has extended its ‘All4' all-wheel drive system to two additional models, Cooper Countryman and Cooper Paceman. Mini now offers a total of 10 models with all-wheel drive configuration. Previously, only the turbocharged Cooper S and John Cooper Works variants were available with all-wheel drive system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+