పవర్‌ఫుల్ మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ ఆవిష్కరణ
ఈ ఫొటోలో మీరు చూస్తున్నది ఆషామాషా మినీ కారు కాదు. ఇదొక పెర్ఫామెన్స్ వెర్షన్ మినీ. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ మరియు పెర్ఫామెన్స్ బ్రాండ్ జాన్ కూపర్ వర్క్స్ సంయుక్తంగా తయారు చేసిన కారు ఇది.
దీని పేరు 'మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్'. మినీ అందిస్తున్న 2014 కూపర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని దీనిని తయారు చేశారు. ఈ కారును తొలిసారిగా జనవరి 2014లో జరగనున్న డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో, మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన అఫీషియల్ ఫొటోలను మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కంపెనీ వెల్లడి చేసింది. ఆ వివరాలేంటో, ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

ఈ సరికొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ కారును తొలిసారిగా 2014 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో (ఎన్ఏఐఏఎస్)లో విడుదల చేస్తారు. దీనిని డెట్రాయిట్ మోటార్ షో అని కూడా పిలుస్తుంటారు.

మినీ ఈ కొత్త జెసిడబ్ల్యూ కారును కాన్సెప్ట్ అని చెబుతున్నప్పటికీ, ఇది ప్రొడక్షన్ దశకు చేరుకుంటే, ఈ కాన్సెప్ట్‌కు మరియు ప్రొడక్షన్ వెర్షన్ కారుకు పెద్దగా వ్యత్యాసాలు ఉండబోవని సమాచారం.

ఈ కొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్‌ను షైనీ గ్రే కలర్‌తో పెయింట్ చేశారు. మినీ దీనిని బ్రైడ్ హైవే గ్రే కలర్ అని పిలుస్తోంది. ఈ గ్రే కలర్ ఎక్స్టీరియర్ పెయింట్‌పై అక్కడక్కడా రెడ్ కలర్‌లో బాడీ, రూఫ్, బానెట్, బూట్‌లపై చేసేని ఫినిషింగ్ మరింత ఆకర్షనీయంగా ఉంటుంది.

ఈ బాడీ లైన్స్‌ను రేస్ ట్రాక్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. కొత్త 18 ఇంచ్ లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్‌తో పాటుగా పూర్తి ఏరోడైనమిక్ ప్యాకేజ్‌తో ఈ కొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేశారు.

ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు బానెట్‌పై ఏర్పాటు చేసిన మరో ఎయిర్ ఇన్‌టేక్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన డిజైన్ మార్పులు. ఈ కారులో 200 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

జాన్ కూపర్ వర్క్స్ ఏరోడైనమిక్ కిట్‌లో భాగంగా పెద్ద బంపర్, సైడ్ స్కర్ట్స్, ఫ్లాప్స్ అండ్ ఫిఫ్యూజర్‌తో కూడిన రియర్ యాప్రాన్‌లను 2014 మినీ కూపర్‌కు జోడించారు. ఇవి కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ కారులో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. హైస్పీడ్ వద్ద సైతం మంచి బ్యాలెన్సింగ్‌ను అందించేలా దీని ఏరోడైనమిక్స్‌ను కస్టమైజ్ చేశారు.

ఎల్ఈడి హెడ్‌లైట్స్ మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్‌లో మరో ప్రత్యేకత. బ్లాక్ సరౌండింగ్స్‌తోకూడిన ఈ హెడ్‌లైట్స్ సేఫ్టీకే కాకుండా, స్టయిలిష్‌గా ఉంటాయి. రెడ్ కలర్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ గ్రిల్‌పై రెడ్ లైన్, ఎయిర్ ఇన్‌టేక్స్ చుట్టూ రెడ్ కలర్ సరౌండిగ్స్‌తో ఇది స్పోర్టీగా అనిపిస్తుంది.

ఇక చివరిగా మినీ జాన్ కూపర్ వర్క్స్ కాన్సెప్ట్ కారులో చెప్పుకోవాల్సింది స్పోర్టీ సైలెన్సర్ గురించి, జెసిడబ్ల్యూ యాంబ్లంతో కూడిన ట్విన్ క్రోమ్ సైలెన్సర్స్ ప్రత్యేకంగా ఉంటాయి.

మినీ జెసిడబ్ల్యూ కాన్సెప్ట్ కారు స్పోర్టీ క్యారెక్టర్‌ను కేవలం విజువల్ అప్‌గ్రేడ్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, ఇంజన్ సౌండ్‌ట్రాక్‌ను కూడా మార్చినట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








