ఆగస్ట్ నెలలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ విడుదల
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాజెరో స్పోర్ట్ ఎస్‍యూవీలో ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆటోమేటిక్ వెర్షన్ మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీ రానున్న ఆగస్ట్ నెలలో విడుదల చేస్తామని, డెలివరీలును సెప్టెంబర్ నాటికి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం మిత్సుబిషి విక్రయిస్తున్న పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బో డీజిల్ ఇంజన్ వేరియంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 178 హార్స్ పవర్‌ల శక్తిని, 2000-2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

కాగా.. మిత్సుబిషి వచ్చే ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్న ఆటోమేటిక్ పాజెరో స్పోర్ట్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అయితే, ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో కాకుండా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది మ్యాన్యువల్ వేరియంట్ కన్నా మరింత ప్రీమియంగా ఉండి, అదనపు ఫీచర్లను కలిగి ఉండనుంది.
మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ వేరియంట్ ధర ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న మ్యాన్యువల్ వేరియంట్ ధర (రూ.24.15 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) సుమారు రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ ఈ సెగ్మెంట్లోని శాంటాఫే, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, షెవర్లే కాప్టివా వంటి మోడళ్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








