రెండేళ్లలో 5 కొత్త మోడళ్లను విడుదల చేయనున్న మిత్సుబిషి

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి భారత్‌లో తమ ట్రెండ్‌ను మార్చుకునేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు లాన్సర్, సెడియా వంటి పవర్‌ఫుల్ సెడాన్లను ఆఫర్ చేసిన మిత్సుబిషి, ఇప్పుడు భారత్‌లో కేవలం ఎస్‌యూవీలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసినదే. అయితే, త్వరలోనే ఈ పరిస్థితి మారనుంది. రానున్న రెండేళ్లలో మిత్సుబిషి మరో ఐదు కొత్త మోడళ్లను భారత్‌కు పరిచయం చేయనుంది.

భారత్‌లో అత్యంత పాపులర్ అయిన హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మిత్సుబిషి ఓ సరికొత్త కారును విడుదల చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్పోరేట్ జనరల్ మేనేజర్ (ఏషియా అండ్ ఏషియాన్ ఆఫీస్) కెన్ హోరినౌచి వెల్లడించారు. రానున్న 2016 నాటికి ఓ హ్యాచ్‌బ్యాక్‌తో కలిపి మొత్తం 5 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని ఆయన వివరించారు.

ప్రారంభంలో భాగంగా ఈ కార్లను ఏషియాన్ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకోనున్నారు, ఆ తర్వాత వీటిని చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్ ప్లాంట్‌లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. ఈ ఐదు మోడళ్లలో ముందుగా ఓ హ్యాచ్‌బ్యాక్ ఆ తర్వాత ఓ కాంపాక్ట్ సెడాన్‌లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మిత్సుబిషి నుంచి 5 కొత్త మోడళ్లు

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ10, మారుతి సెలెరియో వంటి మోడళ్లకు ధీటుగా మిత్సుబిషి తమ మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మిరాజ్ ఇప్పటికే ఇండోనేషియా వంటి పొరుగు దేశాలలో విడుదలై, విజయవంతంగా అమ్ముడుపోతోంది.

మిత్సుబిషి నుంచి 5 కొత్త మోడళ్లు

మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 77 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న మిరాజ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా లభ్యమవుతుంది.

మిత్సుబిషి నుంచి 5 కొత్త మోడళ్లు

ఇక కాంపాక్ట్ సెడాన్ విషయానికి వస్తే.. మిత్సుబిషి మిరాజ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ మిత్సుబిష్ అట్రాజ్ పేరిట ఓ సెడాన్‌ను తయారు చేసింది. అయితే, గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న అట్రాజ్ సెడాన్ 4.2 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇండియాలో ఇది కాంపాక్ట్ సెడాన్ క్రిందకు రాదు కాబట్టి, భారత మార్కెట్‌కు అనుగుణంగా దీనిని మోడిఫై చేసే అవకాశం ఉంది.

మిత్సుబిషి నుంచి 5 కొత్త మోడళ్లు

మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ మిత్సుబిషి అట్రాజ్ సెడాన్‌లోను ఉపయోగిస్తున్నారు.

మిత్సుబిషి నుంచి 5 కొత్త మోడళ్లు

మిత్సుబిషి విడుదల చేయనున్న ఐదు ఉత్పత్తులలో మిరాజ్ హ్యాచ్‌బ్యాక్, అట్రాజ్ సెడాన్‌లతో పాటుగా ఓ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ అవుట్‌లాండర్ ఎస్‌యూవీతో మరో రెండు యుటిలిటీ వాహనాలు ఉండనున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2014, 12:09 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+