మరిన్ని కొత్త కరోలా టీజర్ ఫొటోలను విడుదల చేసిన టొయోటా
జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా తమ నెక్స్ట్ జనరేషన్ కరోలా సెడాన్‌కు సంబంధించి వరుసగా టీజర్లను విడుదల చేస్తుంది. సరికొత్త మార్పులతో సెడాన్ ప్రియులను ఆకట్టుకునేలా కంపెనీ అభివృద్ధి చేసిన 2014 టొయోటా కరోలా సెడాన్‌కు ఇటీవలే కొన్ని టీజర్ ఫొటోలను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు మరిన్ని టీజర్ ఫొటోలను విడుదల చేసింది.
గతంలో ఫ్రంట్ డిజైన్, గ్రిల్, ఫాగ్‌ల్యాంప్స్, రియర్ డిజైన్‌లకు సంబంధించిన టీజర్లను విడుదల చేసిన టొయోటా ఇప్పుడు ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, సరికొత్త ఆడియో సిస్టమ్‌కు సంబంధించిన టీజర్లను విడుదల చేసింది. ప్రొడక్షన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా సెడాన్‌ను ఈనెల 6వ తేదీన ప్రపంచానికి పరిచయం కానుంది.
జూన్ 6, 2013వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో టొయోటా తమ అధునాత కరోలా సెడాన్‌ను ఆవిష్కరించనుంది. ఈ160 (E160) అనే కోడ్‌నేమ్‌తో టొయోటా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 2013 డెట్రాయిట్ ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించిన టొయోటా ఫ్యూరియా కాన్సెప్ట్ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని ఈ 2014 కరోలా సెడాన్‌ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
అమెరికా మార్కెట్లో ఈ మోడల్ కరోలా పేరుతో అమ్ముడవుతుండగా, భారత మార్కెట్లో కరోలా ఆల్టిస్ పేరుతో అమ్ముడవుతోంది. నేటి ఆధునిక యువత అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత స్టయిలిష్, ప్రీమియం లుక్ ఉండేలా కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ నెక్స్ట్ జనరేషన్ కరోలా వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

2014 టొయోటా కరోలా టీజర్ - ఎల్ఈడి హెడ్‌లైట్స్
జూన్ 6న మార్కెట్లోకి విడుదల కానున్న సరికొత్త తరం టొయోటా కరోలాకు సంబంధించి కంపెనీ మరికొన్ని టీజర్లను విడుదల చేసింది. ఈ కొత్త కారులో సరికొత్త ఎల్ఈడి హెడ్‌లైట్లను అమర్చారు.

2014 టొయోటా కరోలా టీజర్ - అల్లాయ్ వీల్స్
నెక్స్ట్ జనరేషన్ 2014 టొయోటా కరోలాలో స్టయిలిష్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. దానికి సంబధించిన టీజర్ ఫొటోనే ఇదే.

2014 టొయోటా కరోలా టీజర్ - ఆడియో సిస్టమ్
కొత్త కరోలా అధునాత ఆడియో సిస్టమ్‌తో లభ్యం కానుంది. దానికి సంబంధించిన టీజర్ ఫొటో ఇది.

2014 టొయోటా కరోలా టీజర్ - ఫ్రంట్
జూన్ 6న ఆవిష్కృతం కానున్న సరికొత్త టొయోటా కరోలాను కంపెనీ గడచిన డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించిన టొయోటా ఫ్యూరియా కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని డిజైన్ చేసింది.

2014 టొయోటా కరోలా టీజర్ - ఫ్రంట్ గ్రిల్
పెద్ద గ్రిల్, సరికొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్‌ను ఈ 2014 టొయోటా కరోలా సెడాన్‌లో గమనించవచ్చు.

2014 టొయోటా కరోలా టీజర్ - రియర్
2014 టొయోటా కరోలా రియర్ డిజైన్, టెయిల్ ల్యాంప్స్ టీజర్ ఫొటో.


Click it and Unblock the Notifications