జాగ్వార్ ఎక్స్‌జేలో అత్యంత విలాసవంతమైన వేరియంట్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ దేశీయ విపణిలో అందిస్తున్న విలాసవంతమైన కారు 'జాగ్వార్ ఎక్స్‌జే'లో మరింత విలాసవంతమైన వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. 'జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్' (Jaguar XJ Ultimate) అనే పేరుతో విపణిలోకి వచ్చిన ఈ సరికొత్త సూపర్ లగ్జరీ జాగ్వార్ కారు అనేక విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. పొడవాటి వీల్‌బేస్ కలిగిన ఎక్స్‌జే కారును ఆధారంగా చేసుకొని కంపెనీ వేరియంట్‌ను రూపొందించింది.
ప్రత్యేకించి ధనిక వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని జాగ్వార్ ఈ కారును ఇండియాలో ప్రవేశపెట్టింది. వెనుక సీటులో కూర్చుని ప్రయాణించే వారికి అల్టిమేట్ లగ్జరీ సదుపాయాలను అందించేలా ఈ కారు ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. కారు లోపలి ఇల్యుమినేషన్ (ఇంటీరియర్ లైటింగ్), ప్రీమియం లెథర్ సీట్స్, ఇండివిడ్యువల్ రియర్ సీట్స్, వైన్ బాటిల్ స్టోరేజ్, వైన్ గ్లాసెస్ ట్రే, వెనుక సీట్లో ప్యాసింజర్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను ఈ కారులో గమనించవచ్చు.
జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్ సూపర్ లగ్జరీ కారులో 5.0 లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 3.0 లీటర్ వి6 టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌లను ఉపయోగించారు. ఇవి రెండు కూడా 8-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్ 5.0 వి8 (పెట్రోల్) - రూ.1.87 కోట్లు
- జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్ 3.0 వి6 (డీజిల్) - రూ.1.78 కోట్లు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్

జాగ్వార్ ఎక్స్‌జే అల్టిమేట్



Click it and Unblock the Notifications








