కొత్త 2013 నానో విడుదల టాటా మోటార్స్ దశ మారుతుందా?

By Ravi

గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసినదే. జులై 2013లో టాటా మోటార్స్ మొత్తం 2052 నానో కార్లను విక్రయించింది. ప్రస్తుత సంవత్సరంలో ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డ్. ఇదిలా ఉండగా, టాటా మోటార్స్ తమ సరికొత్త 2013 నానోను ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. కొత్త నానో రాకతోనే కంపెనీ అమ్మకాలు జోరందుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త నానో ప్రారంభ ధర రూ.1,63,000 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. ఇటీవల తమ హారిజానెక్స్ట్ ప్రణాళికలో భాగంగా కంపెనీ ఆవిష్కరించిన సిఎన్‌జి వెర్షన్ నానో త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కొత్త నానో కారును అప్‌గ్రేడ్ చేశారు.

2013 Tata Nano

కొత్త టాటా నానో కారులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.

రాష్ట్ర మార్కెట్లో కొత్త 2013 టాటా నానో వేరియంట్లు, ధరలు అలా ఉన్నాయి:

  • నానో స్టాండర్డ్ - రూ.1,63,000
  • నానో సిఎక్స్ - రూ.2,01,000
  • నానో ఎల్ఎక్స్ - రూ.2,28,000

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

New Nano

అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు.

కొత్త నానో బేసిక్ డిజైన్, ఇంజన్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2013, 17:29 [IST]
English summary
Tata Nano sales for the month of July 2013 stand at 2052 units, which is it’s highest monthly sales figure reported for current year. New Tata Nano, gets remote keyless entry, twin glove boxes, and a four-speaker AmphiStream™ music system with Bluetooth™, USB and auxiliary connectivity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+