అక్టోబర్‌లో కొత్త 2014 ఫియట్ పుంటో విడుదల
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఫియట్ ఇండియా 2009లో తమ పుంటోను దేశీయ విపణిలో విడదల చేసింది. అప్పటి నుంచి ఈ కారులో చిన్నపాటి మార్పుల తప్ప చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ ఏమీ చేయలేదు.
ఈ నేపథ్యంలో, ఇదివరకి ఫియట్ పుంటోలన్నింటికీ భిన్నంగా, మరింత స్టయిలిష్‌గా, ప్రీమియంగా ఉండేలా ఫియట్ తమ కొత్త 2014 మోడల్‌ని రానున్న అక్టోబర్ నెలలో విపణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను మహారాష్ట్రలోని పూనే సిటీ రోడ్ల టెస్టింగ్ కూడా చేస్తున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కొత్త 2014 ఫియట్ పుంటో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి. ఇందులో ప్రధానంగా.. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్స్‌ను రీడిజైన్ చేశారు. ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు.

కొత్త పుంటోలో కాస్మోటిక్ మార్పులు తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న పుంటోలో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త 2014 పుంటోలోను ఉపయోగించనున్నారు. అయితే పెట్రోల్ వెర్షన్ మాత్రం రెండు ఇంజన్ ఆఫ్షన్లతో 91.2 లీటర్, 68 పిఎస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.4 లీటర్, 90 పిఎస్ పెట్రోల్ ఇంజన్) లభ్యం కానుంది.

డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌నే ఆఫర్ చేయనున్నారు. అయితే, ఇది 76 పిఎస్ పవర్ మరియు 93 పిఎస్ పవర్ ఆప్షన్లతో రెండు విభిన్న ట్యూనింగ్‌లలో లభ్యం కానుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 5-మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానున్నాయి. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండబోదు.

ఇకపోతే కొత్త 2014 ఫియట్ పుంటో ఇంటీరియర్లను కూడా మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇచ్చేలా, కొత్త లీనియా సెడాన్‌లో ఉన్నట్లుగానే అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఏసి వెంట్స్, సెంటర్ కన్సోల్‌లు పియానో బ్లాక్ ఫినిష్‌ను కలిగి ఉండనున్నాయి. డ్యాష్‌బోర్డ్ బ్లాక్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్‌తో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








