విడుదలకు సిద్ధంగా ఉన్న 2014 ఫోర్డ్ ఫియస్టా: అఫీషియల్ ఫొటోలు
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సరికొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ సెడాన్ మరికొద్ది రోజుల్లోనే దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా తమ కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌కు సంబంధించి అఫీయల్ ఫొటోలను, వివరాలను విడుదల చేసింది.
అంతేకాకుండా, కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా కోసం కంపెనీ మీడియా టెస్ట్ డ్రైవ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లకు మధ్య పెద్ద అంతరం ఉన్న తరుణంలో, ప్రారంభంలో భాగంగా ఫోర్డ్ ఇండియా తమ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్‌ను డీజిల్ వెర్షన్‌లో మాత్రమే ఆఫర్ చేయనుంది. అయితే, భవిష్యత్తులో కంపెనీ ఇందులో పెట్రోల్ ఇంజన్ (బహుశా 1.0 లీటర్ ఈకోబూస్ట్)ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ డీజిల్ వెర్షన్‍లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి ఫియస్టాలో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోను ఉపయోగించనున్నారు.

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌లో ప్రధానంగా ఆస్టన్ మార్టిన్ లాంటి ఫ్రంట్ గ్రిల్ (ఇదివరకటి ఫియస్టాలోని బ్లాక్ ప్లాస్టిక్ గ్రిల్ స్థానంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన గ్రిల్) ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది.

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇవి మునపటి కన్నా మరింత స్టయిలిష్‌గా అనిపిస్తాయి.

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టాలో ఉపయోగించిన రీడిజైన్డ్ హెడ్‍లైట్స్ ఇందులో బెస్ట్ ఫీచర్స్‌గా చెప్పుకోవచ్చు. స్వెప్ట్ బ్యాక్ షేపులో ఉండే హెడ్‌ల్యాంప్స్, చక్కగా ఉండే దీని డిజైన్ తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది.

వెనుక వైపు గమనిస్తే, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, డిఫ్యూజర్‌తో కూడిన రియర్ బంపర్‌లు కొత్తవిగా అనిపిస్తాయి. ఇవి కారుకు మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌ని ఇస్తాయి.

కొత్త ఫోర్డ్ ఫియస్టా బాడీని బోరాన్ స్టీల్ అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది రెగ్యులర్ స్టీల్ కన్నా నాలుగు రెట్లు ధృడంగా ఉండి, మంచి సేఫ్టీని ఆఫర్ చేస్తుందని ఫోర్డ్ పేర్కొంది.

2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌లో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే ఈ స్టయిలిష్ అల్లాయ్ వీల్స్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

కొత్త 2014 ఫియస్టా ఫోర్డ్ పాపులర్ సింక్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఈ సిస్టమ్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ ఫోన్ కాల్స్, హ్యాండ్సీ-ఫ్రీ మ్యూజిక్ ప్లేబ్యాక్, టెక్స్ట్ మెసేజ్ రీడ్-అవుట్, యాప్‌లింక్, వాయిస్ యాక్టివేటెడ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి పలు ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే ఈకోస్పోర్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు.

ఇందులో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌లైట్స్ వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లు టాప్ ఎండ్ వేరియంట్ ఫియస్టాలో లభ్యం కానున్నాయి.

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్‌లో ఉపయోగిస్తున్న 1.5 లీటర్, టిడిసిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








