కొత్త 2014 నిస్సాన్ క్యాష్‌కాయ్ ఎస్‌యూవీ విడుదల
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న 'నిస్సాన్ క్యాష్‌కాయ్' (Nissan Qashqai)లో 2014 వెర్షన్‌ను ఆవిష్కరించింది. యూకేలోని లండన్‌లో నిర్వహించిన ఓ థ్రిల్లింగ్ 3డి సోషల్ మీడియా డిజిటల్ మ్యాపింగ్ షోలో నిస్సాన్ ఈ కొత్త 2014 క్యాష్‌కాయ్ మోడల్‌ను విడుదల చేసింది. నిస్సాన్ ఖాష్కాయ్ క్రాసోవర్ అతికొద్ది కాలంలోనే అత్యంత పాపులర్ మోడల్ అయ్యింది.
ప్రపంత వ్యాప్తంగా నిస్సాన్ క్యాష్‌కాయ్‌కు 20 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు. దీని ఆకర్షనీయమైన స్టైల్, అధునాతన టెక్నాలజీ, ఫన్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ అన్నింటికి మించి మెరుగైన మైలేజ్ వంటి అంశాలు కస్టమర్లను ఆకట్టుకునేలా చేశాయి. కాగా.. నిస్సాన్ కొత్తగా ఆవిష్కరించిన రెండవ తరం క్యాష్‌కాయ్‌లో కూడా ప్రీమియం టెక్నాలజీ, ఎన్‌హాన్స్డ్ డైనమిక్స్‌తో లభ్యం కానుంది.
కాగా.. ఈ క్యాష్‌కాయ్‌ను భారత మార్కెట్లో విడుదల చేయటానికి గల సాధ్యాసాధ్యాలను నిస్సాన్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకోవాలని నిస్సాన్ భావిస్తోంది.

మరి ఈ సరికొత్త నిస్సాన్ క్యాష్‌కాయ్ క్రాసోవర్‌లోని కొత్త అంశాలేంటో తెలుసుకుందాం రండి. సెకండ్ జనరేషన్ క్యాష్‌కాయ్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

కొత్త 2014 నిస్సాన్ క్యాష్‌కాయ్ బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ సెకండ్ జనరేషన్ ఖాష్కాయ్ మునుపటి మోడల్ కన్నా 20 మి.మీ. ఎక్కువ వెడల్పును, 49 మి.మీ. ఎక్కువ పొడవును మరియు 15 మి.మీ. తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది.

సెకండ్ జనరేషన్ క్యాష్‌కాయ్ క్రాసోవర్‌ను కొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది టూ-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు వెర్షన్లలో ఛాసిస్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌లో యాక్టివ్ రైడ్ కంట్రోల్, యాక్టివ్ ఇంజన్ బ్రేక్, ట్రేస్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ప్యాసింజర్లు, డ్రైవర్‌కు పూర్తిస్థాయి సౌకర్యాన్ని కల్పించేలా కొత్త క్యాష్‌కాయ్ ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ట్రెండీ ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీట్స్, ఈజీ యాక్ససెబల్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్లు దీని సొంతం.

కొత్త 2014 నిస్సాన్ క్యాష్‌కాయ్‌లోని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలా దీని సీట్లను డిజైన్ చేశారు. నిస్సాన్ ఇంజనీర్లు నాసా నుంచి స్ఫూర్తి పొంది, మెడికల్ స్కానింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగించి ప్యాసింజర్ల బిపి (రక్త ప్రసరణను) తనిఖీ చేసి, దానికి అనుగుణంగా లోవర్ బ్యాక్ సపోర్ట్ అందించేలా సీట్లను తయారు చేశారు.

విశాలమైన బూట్ స్పేస్ నిస్సాన్ క్యాష్‌కాయ్ సొంతం. దీని మొత్తం బూట్ స్పేస్ 430 లీటర్లు (వెనుక సీట్లు మడచిపెట్టకుండా), ఇదివరకటి క్యాష్‌కాయ్‌తో పోల్చుకుంటే బూట్ స్పేస్‌ను 20 లీటర్లు పెంచారు.

పెట్రోల్ ఇంజన్
* 1.2 డిఐజి-టి (115 పిఎస్) - 21.42 కెఎమ్‌పిఎల్
* 1.6 డిఐజి-టి (150 పిఎస్) - 21.42 కెఎమ్‌పిఎల్
డీజిల్ ఇంజన్
* 1.5 డిసిఐ (110 పిఎస్) - 31.5 కెఎమ్‌పిఎల్
* 1.6 డిసిఐ (130 పిఎస్) - 27.2 కెఎమ్‌పిఎల్ [2x4], 24.48 కెఎమ్‌పిఎల్ [4x4]

- క్యాష్‌కాయ్ టెక్నాలజీ హైలైట్స్
హై బీమ్ అసిస్ట్
ఛాసిస్ కంట్రోల్
బ్లైండ్ స్పాట్ వార్నింగ్
అరౌండ్ వ్యూ మోనిటర్
ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్
లేన్ డిపాచ్యుర్ వార్నింగ్
మూవింగ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్
డ్రైవర్ అటెన్షన్ సపోర్ట్
ఫ్రంట్ కొలైజన్ అవైడెన్స్
ఇంటెలిజెంట్ పార్కింగ్ అసిస్ట్
నిస్సాన్ కనెక్ట్ (స్మార్ట్ ఫోన్ యాప్)

కొత్త నిస్సాన్ క్యాష్‌కాయ్ ధర, ఇతర వేరియంట్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఫిబ్రవరి 2014లో దీనిని విడుదల చేయనున్నారు. అదే సమయంలోనే మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

కొత్త క్యాష్‌కాయ్‌ని రెనో-నిస్సాన్ అలయన్స్ ప్లాట్‌ఫామ్ అయిన కొత్త సిఎమ్ఎఫ్ (కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ)పై తయారు చేశారు. వినియోదారునికి అత్యుత్తమైన ఇంజనీరింగ్ సామర్థ్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను తయారు చేశారు.


Click it and Unblock the Notifications








