కొత్త 2014 టొయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని మరియు ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) సెగ్మంట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు గాను ఈ సెగ్మెంట్ లీడర్‌గా టొయోటా, తమ బెస్ట్ సెల్లింగ్ ఇన్నోవా ఎమ్‌పివిలో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. పరిమిత సంఖ్యలో మాత్రం లభ్యం కానున్న ఈ 2014 టొయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్ రెగ్యులర్ ఇన్నోవా వేరియంట్ల కన్నా మరింత ప్రీమియంగా అనిపిస్తుంది.
కొత్త 2014 టొయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్ బ్రాంజ్ మైకా మెటాలిక్, సిల్వర్ మైకా మెటాలిక్ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కేవలం 1500 యూనిట్లు మాత్రమే, అవి కూడా నవంబర్ 2014 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొత్త టొయోటా ఇన్నోవా ఎల్ఈ (లిమిటెడ్ ఎడిషన్)ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న జిఎక్స్ గ్రేడ్ వేరియంట్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు. లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవాలో లభించే ఫీచర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టొయోటా ఇన్నోవా ఎల్ఈలో అధునాతన డి-4డి డీజిల్ ఇంజిన్ టెక్నాలజీని వినియోగించారు. ఇది 7-సీటర్ మరియు 8-సీటర్ ఆప్షన్లతో యూరో 3, యూరో 4 కాలుష్య నిబంధనలు పాటించే ఇంజన్లతో లభిస్తుంది.

ఎక్స్టీరియర్స్
ఇన్నోవాకు మరింత ప్రీమియం లుక్ కల్పించేందుకు హెడ్‌ల్యాంప్స్‌కు దిగువన క్రోమ్ గార్నిష్ చేశారు. అలాగే రియర్ కాంబినేషన్ ల్యాంప్ వద్ద కూడా క్రోమ్ గార్నిష్ గమనించవచ్చు. ఇన్నోవా ఎల్ఈ సైడ్స్‌పై సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌ను, వెనుక వైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను చూడొచ్చు. ఇందులో బ్రాంజ్ మైకా మెటాలిక్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేశారు.

ఇంటీరియర్స్
ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇది ప్రీమియం డ్యూయెల్ టోన్ ఫ్యాబ్రిక్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో డివిడి, సిడి, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, రిమోట్ కంట్రోల్ మరియు బ్లూటూత్ ఫంక్షనాలిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సేఫ్టీ ఫీచర్స్
ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవాలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన టొయోటా క్యూడిఆర్ (క్వాలిటీ, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ) ప్రమాణాలతో దీనిని తయారు చేశారు.

ధరలు
కొత్త టొయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్ ధరలు రూ.12,90,947 - రూ.13,00,710 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ లిమిటెడ్ ఎడిషన్ లభిస్తుంది, మిగిలిన ప్రాంతాల్లో లిమిటెడ్ ఎడిషన్ యాక్ససరీ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది.
వీడియో
టొయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్ గురించి కంపెనీ అధికారులు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే వినండి.


Click it and Unblock the Notifications








