కొత్త 2015 రెనో డస్టర్ విడుదల: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2015 రెనో డస్టర్ ఎక్స్టీరియర్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, క్యాబిన్ లోపల మరిన్ని కొత్త ఫీచర్లతో ఈ మోడల్‌ను తయారు చేశారు.
మెకానికల్‌గా చూసుకుంటే కొత్త డస్టర్‌లో యాక్సిలరేషన్ మరియు లో-ఎండ్ టార్క్‌ను కూడా మెరుగు పరచినట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో కొత్త 2015 రెనో డస్టర్ ప్రారంభ ధర రూ.8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2015 రెనో డస్టర్‌లో ఫ్రంట్ ప్యాసింజర్ల కోసం ఆర్మ్ రెస్ట్, గేర్‌షిప్ట్ ఇండికేటర్ మరియు సర్వీస్ రిమైండర్లతో కూడిన కొత్త మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఈకో మోడ్ ఫీచర్, క్రూయిజ్ కంట్రోల్ అండ్ స్పీడ్ లిమిటర్, కొత్త స్టీరింగ్ కాలమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, రిఫ్రెష్డ్ సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హెలెస్ట్రీ వంటి ఫీచర్లున్నాయి.
ఈ అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.6 లీటర్ పెట్రోల్ (103 బిహెచ్‌పి), 1.5 లీటర్ డీజిల్ (84 బిహెచ్‌పి), 1.5 లీటర్ డీజిల్ (108 బిహెచ్‌పి) ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కొత్త డస్టర్‌లో డీజిల్ మోడళ్ల మైలేజీని మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది. తాజా వివరాల ప్రకారం, 84 బిహెచ్‌పి డీజిల్ వెర్షన్ లీటరుకు 19.87 కిలోమీటర్ల మైలేజీని, 108 బిహెచ్‌పి డీజిల్ వెర్షన్ లీటరుకు 19.64 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








