భారత్‌లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల; ధర రూ.13.54 కోట్లు

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న పవర్‌ఫుల్ 'ఎమ్5' (M5) మోడల్‌లో కంపెనీ ఓ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 మోడల్‌ను కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. ఫలితంగా దీని ధర కూడా అధికంగా ఉంటుంది.

ట్రేడ్‌మార్క్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ స్టైల్‌లో ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5ని కొత్త డైనమిక్స్ డైమెన్షన్‌తో తయారు చేశారు. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ధరను రూ.13.54 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలోను దీని ధర స్థిరంగా ఉంటుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆల్పైన్ వైట్ కలర్‌లో లభిస్తుంది, ఇది నాన్-మెటాలిక్ పెయింట్. మెటాలిక్ పెయింట్ ఆప్షన్‌లో ఇది బ్లాక్ సఫైర్, ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్, మోంట్ కార్లో బ్లూ, సాఖిర్ ఆరెంజ్, సిల్వర్‌స్టోన్, సింగపూప్ గ్రే, స్పేస్ గ్రే కలర్లలో లభిస్తుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల

ఇంటీరియర్స్‌లో స్టాండర్డ్ లెథర్ మెరీనో అప్‌హోలెస్ట్రీని ఆఫర్ చేస్తున్నారు. ఇది బ్లాక్, సాఖిర్ ఆరెంజ్, సిల్వర్‌స్టోన్ కలర్ కాంబినేషన్లతో లభిస్తుంది. ఇంటీరియర్ ట్రిమ్స్‌లో ఫైన్-ఉడ్ ట్రిమ్ యాష్ గ్రెయిన్ బ్రౌన్, ఫైన్-ఉడ్ ట్రిమ్ ఫైన్‌లైన్ ఆంథ్రాసైట్‌తో ఆఫర్ చేస్తున్నారు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో ఎమ్ ట్విన్‌పవర్ టర్బో, 8-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న అన్ని ఇంజన్లలో కెల్లా అత్యంత శక్తివంతమైనది. ఈ ఇంజన్ గరిష్టంగా 560 హెచ్‌పిల శక్తిని, 680 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల

ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎమ్ డ్యూయెల్-క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులోని క్రూయిజ్ కంట్రోల్, ఫైన్ ట్యూన్ చేయబడిన గేరింగ్ అండ్ గేర్ ఛేంజెస్ ద్వారా హైయ్యర్ షిఫ్టింగ్ మరియు, డ్రైవింగ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, యాక్టివ్ ఎమ్ డిఫరెన్షియల్ (సస్పెన్షన్ కోసం), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి), ఎమ్ డైనమిక్ మోడ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ ప్రొటెక్షన్, యాక్టివ్‌నెస్ అసిస్టెంట్, యాక్టివ్ హెడ్‌రెస్ట్స్ (ఫ్రంట్) వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 25, 2014, 10:07 [IST]
English summary
The most successful high-performance sedan from BMW M GmbH, the new BMW M5 was launched in India. The new BMW M5 is available at BMW dealerships across India as a CBU (Completely Built-Up).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+