2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల: ధర, వివరాలు

By Ravi

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నేడు (నవంబర్ 14, 2013)న తమ సరికొత్త కన్వర్టిబల్ కారు '2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4' (2014 BMW Z4) భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త జెడ్4 కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.

దేశీయ విపణిలో 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఎస్‌డ్రైవ్ 35ఐ - రూ.68.9 లక్షలు
  • 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఎస్‌డ్రైవ్ 35ఐ డిజైన్ ప్యూర్ ట్రాక్షన్ - రూ.69.9 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)
ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫొటోలు మరియు వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

మునుపటి వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 కారుతో పోల్చుకుంటే, కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 కారులో సైడ్ ఇండికేటర్స్ దగ్గర గమనిస్తే, ఓ చిన్నపాటి మెలిక లాంటి డిజైన్ కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేసి, గ్రిల్ చూట్టూ క్రోమ్ సరౌండింగ్‌ను జోడించారు. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ మార్పు కనిపించదు. డిజైన్‌లో ఈ చిన్న పాటి మార్పులు తప్పితే పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

ఫీచర్లలో మార్పుల విషయానికి వస్తే, ఎల్ఈడి హెడ్‌లైట్స్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ ఆప్షన్స్, అధనపు బాడీ కలర్స్ మరియు ఆప్షనల్ కాంట్రాస్ట్ రూఫ్ వంటి ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. ప్రత్యేకించి ఈ కొత్త వలెన్సియా ఆరెంజ్ కలర్ (ఫొటోలో కనిపిస్తున్న కారు)ను కొత్తగా జోడించారు.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

ఇంటీరియర్ మార్పులను గమనిస్తే, గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, 'ఫైన్‌లైన్ ఆంథ్రాసిట్' ఉడ్ ఫినిష్‌తో డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ వంటివి ప్రధానంగా గమనించవచ్చు.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

ఇదొక టూ సీటర్ కన్వర్టిబల్ కారు. ఇందులో ఇద్దరికి (డ్రైవర్, ప్యాసింజర్) మాత్రమే చోటు ఉంటుంది. ఇందులోని స్పోర్టీ సీట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సీట్లపై బాడీ కలర్‌కు అనుగుణంగా మధ్యభాగంలో ప్రత్యేకమైన లైన్ లాంటి డిజైన్ ఉంటుంది.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

సాంకేతిక పరమైన మార్పుల విషయానికి వస్తే, ఇందులోని కొన్ని ఎలక్ట్రానిక్స్‌ను మరింత మెరుగుపరచారు. ఇందులో అప్‌గ్రేడ్ చేయబడిన ఐడ్రైవ్ సిస్టమ్ మీ ఐఫోన్‌ను కూడా రికగ్నైజ్ చేస్తుంది.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 3.0 లీటర్, ట్విన్ టర్బో, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 306 హెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

కొత్త బిఎమ్‌డబ్ల్యూ జెడ్‌4 కారులో ఇంజన్ నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది. ఫలితంగా ఇది కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 విడుదల

బిఎమ్‌డబ్ల్యూ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2014 జెడ్4 స్పోర్ట్స్ కారును ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 డెట్రాయిట్ మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా ఆవిష్కరించింది.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2013, 15:21 [IST]
English summary
The 2014 model year BMW Z4 roadster has been launched in India. The stylish new hardtop convertible was revealed earlier this year at the Detroit Motor Show. The new BMW Z4 is mostly unchanged from the outgoing model, with all the changes limited to cosmetic updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+