ఫేస్‌లిఫ్ట్ షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ విడుదల; వివరాలు

By Ravi

జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్లలో కంపెనీ రిఫ్రెష్డ్ వెర్షన్లను నేడు (సెప్టెంబర్ 24, 2014) మార్కెట్లో విడుదల చేసింది. కొత్త సెయిల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. అవేంటంటే..

షెవర్లే కార్వెట్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన డ్యూయెల్ కాక్‌పిట్ డిజైన్, లెథరెట్ సీట్స్, ఐసీ బ్లూ కలర్ ఇల్యుమినేషన్, బ్లాక్ అండ్ బీజ్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, సిల్వర్ అండ్ క్రోమ్ గార్నిష్, 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్ (బ్లూటూత్ కనెక్టివిటీతో), ఏసి వెంట్స్ మరియు గేర్ నాబ్ చుట్టూ క్రోమ్ గార్నిష్, సిల్వర్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ వంటి మార్పులు ఇంటీరియర్స్‌లో ప్రధానంగా చెప్పుకోదగినవి.


ఎక్స్టీరియర్స్‌లో డైనమిక్ స్కల్ప్చర్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేసిన ఫ్రంట్ డిజైన్, డ్యూయెల్ పోర్ట్ గ్రిల్, గెల్డెనో షెవర్లే లోగో, హాక్ వింగ్ స్టైల్ హెడ్‌ల్యాంప్స్, షూటింగ్ స్టార్ స్టైల్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిషింగ్ మొదలైన మార్పులను కొత్త సెయిల్‌లో చూడొచ్చు.

డీజిల్ వెర్షన్ షెవర్లే సెయిల్‌లో 1.3 లీటర్ ఎస్‌డిఈ స్మార్ట్‌టెక్ టర్బో-చార్జ్డ్ కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను పూనే మరియు బెంగుళూరులో ఉన్న జిఎమ్ ఇంజనీర్ల సహకారంతో ఇటలీలోని టురిన్‌లో ఉన్న జిఎమ్ డీజిల్ ఇంజన్ టెక్నికల్ సెంటర్‌లో డెవలప్ చేశారు. ఈ ఇంజన్ బెటర్ పెర్ఫార్మెన్స్‌ను మరియు బెటర్ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

సెయిల్‌లో 1.3 లీటర్ ఎస్‌డిఈ స్మార్ట్‌టెక్ టర్బో-చార్జ్డ్ కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 22.1 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ వైబ్రేషన్, నాయిస్, హార్ష్‌నెస్ తక్కువగా ఉంటుంది.


పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే.. స్థానికంగా అభివృద్ధి చేసిన 1.2 లీటర్ స్మార్టెక్ పెట్రోల్ ఇంజన్‌ను పెట్రోల్ వెర్షన్ సెయిల్ మోడళ్లలో ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను ఇండియాలోని జిఎమ్ టెక్నికల్ సెంటర్‌లో డెవలప్ చేశారు. ఈ ఇంజన్‌ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83.6 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 108.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 18.2 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త షెవర్లే సెయిల్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది, అవి - వెల్వెట్ రెడ్ (సెడాన్లో మాత్రమే), సూపర్ రెడ్ (హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రమే), స్విచ్‌బ్లేడ్ సిల్వర్, సమ్మిట్ వైట్, కేవియర్ బ్లాక్, లీనెన్ బీజ్, శాండ్రిఫ్ట్ గ్రే.

షెవర్లే సెయిల్ ధృడమైన బాడీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, ఇందులో ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ డోర్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి మొదలైన సేఫ్టీ ఫీచర్లున్నాయి.

New Chevrolet SAIL Sedan

కంప్లీట్ కార్ కేర్ ప్రోగ్రామ్
షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ వెర్షన్లు షెవర్లే కంప్లీట్ కార్ ప్రోగ్రామ్‌తో లభిస్తాయి. ఇందులో భాగంగా కంపెనీ తక్కువ మెయింటినెన్స్ ఖర్చులు, ఎక్స్‌క్లూజివ్ వారంటీ ప్యాకేజ్‌లు, షెవర్లే యూ-ఫస్ట్ కస్టమర్ ప్రోగ్రామ్స్, యాప్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (3 ఏళ్లు ఉచితం) మొదలైన సేవలను ఆఫర్ చేస్తుంది.

జనరల్ మోటార్స్ తొలిసారిగా 2012లో సెయిల్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. ప్రత్యేకించి భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ఉద్దేశించి తయారు చేసిన సెయిల్ జులై 2014 నాటిలి 10 లక్షల అమ్మకాల మార్కును చేరుకుంది.

కొత్త 2014 సెయిల్ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.41 లక్షల నుంచి రూ.6.81 లక్షల మధ్యలో ఉండగా, 2014 సెయిల్ సెడాన్ ధరలు రూ.5.19 లక్షల నుంచి రూ.7.64 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2014, 12:52 [IST]
English summary
General Motors India today launched the new Chevrolet SAIL hatchback and sedan. The SAIL hatchback is priced between Rs 4.41 and Rs 6.81 lakh and the SAIL sedan is priced between Rs 5.19 and Rs 7.64 lakh (ex-showroom, New Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+