కొత్త హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ విడుదల

By Ravi

హోండా కార్స్ ఇండియా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్'లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. 'హోండా అమేజ్ ఎస్ఎక్స్' పేరిట మరిన్ని అధనపు సేఫ్టీ ఫీచర్లతో కూడిన కొత్త వేరియంట్‌ను హోండా పరిచయం చేసింది.

ప్రస్తుతం లభిస్తున్న హోండా అమేజ్ ఎస్ వేరియంట్‌కు ఎగువన ఈ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నారు, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే).

ఈ కొత్త హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్‌లో రెగ్యులర్ ఎస్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా, ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్‌ల కోసం), అన్ని డీజిల్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభించే ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌ను ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ ఎస్ఎక్స్ వేరియంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు.

Honda Amaze SX

హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
  • హోండా అమేజ్ ఎస్ఎక్స్ (పెట్రోల్): రూ.6.22 లక్షలు
  • హోండా అమేజ్ ఎస్ఎక్స్ (డీజిల్): రూ.7.12 లక్షలు

తాజా వేరియంట్ల చేరికతో హోండా అమేజ్ మొత్తం వేరియంట్ల సంఖ్య 12కి చేరుకుంది: అవి..
హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్స్
1. అమేజ్ ఈ
2. అమేజ్ ఈఎక్స్
3. అమేజ్ ఎస్
4. అమేజ్ ఎస్ఎక్స్ (కొత్తది)
5. అమేజ్ విఎక్స్
6. అమేజ్ ఎస్ ఏటి
7. అమేజ్ విఎక్స్ ఏటి

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్స్
8. అమేజ్ ఈ
9. అమేజ్ ఈఎక్స్
10. అమేజ్ ఎస్
11. అమేజ్ ఎస్ఎక్స్ (కొత్తది)
12. అమేజ్ విఎక్స్

More from DriveSpark

Article Published On: Thursday, January 16, 2014, 7:56 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL) has introduced a new “SX” variant of Honda Amaze with added safety features. The new “SX” variant will be positioned above the “S” variant and will be available in both Petrol and Diesel with Manual Transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+