హోండా సిఆర్-వి 'చిన్నన్న' హోండా హెచ్ఆర్-వి ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ హోండా, గడచిన 2014 ప్యారిస్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించిన హోండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఇటీవలే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌ని ఇప్పటికే కొన్ని మార్కెట్లలో హోండా వెజెల్ పేరుతో అమ్ముడవుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ యూకే మార్కెట్లో కూడా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో, యూకే వెర్షన్ హోండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్‌ను కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే నెలలో జరగనున్న 2015 జెనీవా అంతర్జాతీయ ఆటో షోలో కూడా ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. హోండా అందిస్తున్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సిఆర్-వి మోడల్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ హెచ్ఆర్-విని డిజైన్ చేశారు.
హోండా హెచ్ఆర్-వికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

తర్వాతి స్లైడ్‌లలో హండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోండి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గిరాకీ ఎక్కువగా మార్కెట్లను (ప్రత్యేకించి భారత మార్కెట్‌ను) లక్ష్యంగా చేసుకొని హోండా తమ హెచ్ఆర్-విని అభివృద్ధి చేసింది.

యూకే వెర్షన్ హోండా హెచ్ఆర్-వి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇది 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్, 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇమజన్లతో లభిస్తుంది.

ఇవి రెండూ కూడా హోండా ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ సిరీస్‌లోని ఇంజన్లే. రెండూ కూడా యూరో 6 కాలుష్య నిబంధనలను పాటిస్తాయి.

గేర్ బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్, సివిటి గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. ఇకపోతే 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

కొత్త హోండా హెచ్ఆర్-విలోని 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 130 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా.. 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త హోండా హెచ్ఆర్-విలో ఏబిఎస్, ఈబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్‌లు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా లభ్యం కానున్నాయి.

హోండా హెచ్ఆర్-వి నెక్స్ట్ స్టాప్ బహుశా ఇండియా కావచ్చు. ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో త్వరలో మహీంద్రా నుంచి రానున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలతో ఇది పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








