ఆటో ఎక్స్‌పో 2014: సరికొత్త హోండా జాజ్ ఆవిష్కరణ

By Ravi

ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో హోండా తమ సరికొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటికే జపాన్ మార్కెట్లో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే వాణిజ్య పరంగా భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ఈ కొత్త తరం జాజ్‌ను భారత్‌కు తీసుకురాన్న నేపథ్యంలో, హోండా కార్స్ ఇండియా గతంలోనే పాత తరం జాజ్ అమ్మకాలను, ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఆ సక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సరికొత్త 2014 హోండా జాజ్ పెట్రోల్ వెర్షన్‌తో పాటుగా డీజిల్ వెర్షన్‌లోను లభ్యం కానుంది.

ప్రస్తుతం హోండా అందిస్తున్న అమేజ్, సిటీ సెడాన్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ సరికొత్త హోండా జాజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సరికొత్త హోండా జాజ్ ఆవిష్కరణ

కొత్త హోండా జాజ్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా దీని ఏరోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు.

సరికొత్త హోండా జాజ్ ఆవిష్కరణ

ఈ 2014 హోండా జాజ్ సైడ్ డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. దీని ఆకర్షనీయమైన బాడీ లైన్స్ మంచి స్పోర్టీ, షార్ప్ లుక్‌నిస్తాయి.

సరికొత్త హోండా జాజ్ ఆవిష్కరణ

కొత్త హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిలో స్థానికంగా లభ్యమయ్యే భాగాలను ఉపయోగించడం వలన (లోకలైజేషన్‌) సరసమైన ధరకే ఈ మోడల్‌ను ఆఫర్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

సరికొత్త హోండా జాజ్ ఆవిష్కరణ

సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లతో దీనిని తయారు చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2014, 17:13 [IST]
English summary
The Honda Jazz has been in India for a long time now however, the Japanese manufactured car hasn't sold numbers as expected. Now they have launched a refreshed version of it at the 2014 auto expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+