నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా ఇదే!

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లూయిడిక్ వెర్నా సెడాన్‌లో త్వరలోనే ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేసింది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా పేరుతో అమ్ముడుపోతున్న ఈ సెడాన్ రష్యా మార్కెట్లో హ్యుందాయ్ సోలారిస్ పేరుతో అమ్ముడవుతోంది.

ఈ నేపథ్యంలో, రష్యన్ మార్కెట్లో హ్యుందాయ్ ఓ నెక్స్ట్ జనరేషన్ సోలారిస్ (వెర్నా) సెడాన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఈ కొత్త 2014 హ్యుందాయ్ సోలారిస్ (వెర్నా)ను అభివృద్ధి చేశారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వెర్నాలోని ఫ్రంట్ డిజైన్‌లోనే అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.


ప్రధానంగా.. రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్, రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ట్విన్ హారిజాంటల్ క్రోమ్ గ్రిల్, సన్నటి మరియు వెడల్పాటి ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు. అలాగే హెడ్‌లైట్స్ చుట్టూ ఉండే స్టయిలిష్ బాడీ లైన్స్ కూడా ఇందులో కొత్తగా డిజైన్ చేశారు. వెనుక వైపు డిజైన్‌లో మార్పులు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి.

ఇందులో ప్రధానంగా, ఎల్ఈడి లైట్లతో తయారు చేయబడిన బ్రేక్ ల్యాంప్స్, వెనుక బంపర్‌కు దిగువ భాగంలో అమర్చబడిన రిఫ్లెక్టర్స్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, బంపర్ క్రింది భాగంలో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు. ఇకపోతే, కొత్త 2014 హ్యుందాయ్ సొలారిస్ (వెర్నా) సెడాన్ ఇంటీరియర్లలో చెప్పుకోదగిన ప్రధాన మార్పులేవీ లేవని తెలుస్తోంది.

2014 Hyundai Verna

ఇంజన్స్ పరంగా కూడా కొత్త వెర్నాలో ఎలాంటి మార్పులు లేవు. రష్యన్ మార్కెట్లో ఇది 1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అక్కడి మార్కెట్లో 1.6 లీటర్ పెట్రోల్ వెర్షన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

రష్యాలో కొత్త 2014 హ్యుందాయ్ సొలారిస్ (వెర్నా) ప్రారంభ ధర 4,73,900 రూబెల్స్‌గా ఉంది. అంటే, మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.8 లక్షలు. సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్ రాక ముందు వరకు బెస్ట్ సెల్లింగ్ ఫుల్ సైజ్ సెడాన్ ఉన్న హ్యుందాయ్ వెర్నా, సిటీ రాకతో దీని అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో, వెర్నాకు పూర్వ వైభవాన్ని కల్పించేందుకు కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను వీలైనంత త్వరగా భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2014, 16:43 [IST]
English summary
The India bound next-gen Hyundai Verna has been launched in Russia where the sedan is sold under the Solaris nameplate. The 2014 Hyundai Solaris facelift brings with it elements of the automaker's Fluidic Sculpture 2.0 design philosophy, which it has already previewed in the new Genesis and the new Sonata.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+