మారుతి ఆల్టో కె10 ఏఎమ్‌టి కావాలా? 2 నెలలు ఆగండి!

By Ravi

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన సరికొత్త ఆల్టో కె10 కారులో కంపెనీ తొలిసారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో గేర్ షిఫ్ట్ (ఏజిఎస్)గా పిలుస్తోంది. సెలెరియో ఏఎమ్‌టి మాదిరిగానే ఆల్టో కె10 ఏఎమ్‌టి కూడా గొప్ప సక్సెస్‌ను సాధించింది.

కొత్త మారుతి ఆల్టో కె10లోని కంప్లీట్ ఫీచర్స్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గతంలో సెలెరియో ఏఎమ్‌టి మార్కెట్లో విడుదలైనప్పుడు దాని వెయింటిగ్ పీరియడ్ 3 నెలల వరకూ ఉండేది. ఇప్పుడు కొత్త ఆల్టో కె10 ఏఎమ్‌టి విషయంలోను అదే జరుగుతోంది. ఈ వేరియంట్ కోసం కస్టమర్లు సుమారు 2 నెలల వరకూ వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారును మార్కెట్లో విడుదల చేసే సమయంలో కంపెనీ అధికారుల దీని వెయిటింగ్ పీరియడ్ గురించి ప్రస్తావించారు.

కొత్త ఆల్టో కె10 మోడల్‌ను బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ఎస్ కల్సి, కొత్త ఆల్టో కె10 ఏఎమ్‌టి వెయిటింగ్ పీరియడ్ గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ వేరియంట్ కోసం కస్టమర్లు కనీసం 2 నెలల వరకూ వేచి ఉండాలని సమాధానమిచ్చారు.

ఇదిలా ఉంటే.. భారత్‌లో మారుతి సుజుకి విక్రయిస్తున్న ఏఎమ్‌టి మోడళ్లలో ఉపయోగించే కిట్‌‌లను ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ విపణిలో ఏఎమ్‌టి మోడళ్లకు గిరాకీ జోరందుకోవటంతో కంపెనీ ఏఎమ్‌టి కిట్‌ల సప్లయ్‌ను పెంచుకోవాలని యోచిస్తోంది. అంతేకాకుండా, త్వరలోనే భారత్‌లోనే వీటిని అసెంబ్లింగ్ చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తోంది.

ఇక కొత్త ఆల్టో కె10 విషయానికి వస్తే.. కంపెనీ అందిస్తున్న ఆల్టో 800 మోడల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అదే డిజైన్ ఫిలాసఫీతో దీనిని తయారు చేశారు. ఇందులో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

Alto K10 AMT

కొత్త ఆల్టో కె10లో ఇంప్రూవ్డ్ 998సీసీ, 3-సిలిండర్, కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌‌తో పాటుగా, సెలెరియో ద్వారా కొత్తగా పరిచయం చేసిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా ఆఫర్ చేస్తున్నారు.

మునుపటి ఆల్టో కె10తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆల్టో కె10 మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం.. పెట్రోల్ వెర్షన్ ఆల్టో కె10 లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో 2015 ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు:

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ - రూ.3.18 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ - రూ.3.34 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ - రూ.3.50 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.3.70 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆటోమేటిక్) - రూ.3.94 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.3.95 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Most Read Articles

English summary
Maruti Suzuki has recently launched its all-new next generation Alto K10 hatchback in India. Now our sources revealed that, the new Maruti Alto K10 AMT gets waiting period of up to 2 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X