ఇదే కొత్త మారుతి ఆల్టో కె10.. వేరియంట్స్ వారీ వివరాలు
మారుతి సుజుకి ఇండియా త్వరలో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్ ఆల్టో కె10 మోడల్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త మారుతి ఆల్టో కె10 మోడల్ ఫోటోలు మరియు వేరియంట్ల వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఆప్షనల్). అంతేకాకుండా సెలెరియో మాదిరిగా ఆల్టో కె10 కూడా ఆటోమేటిక్ (ఏఎమ్‌టి) ఆప్షన్‌తో లభ్యం కానుంది. ప్రతి వేరియంట్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న ఫీచర్ల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో కొత్త 2014 మారుతి ఆల్టో కె10లో లభించే వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను తెలుసుకోండి.

మారుతి ఎల్ఎక్స్ వేరియంట్ ఫీచర్స్
ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ వేరియంట్‌లో.. మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ (హీటర్ ఆప్షన్‌తో), ఫ్రంట్ అండ్ రియర్ ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్స్, ఫ్యాబ్రిక్ అప్‌హెలెస్ట్రీ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్ అంటే కేవలం సీట్‌బెల్ట్స్ మాత్రమే. ఈ బేస్ వేరియంట్‌లో పవర్ స్టీరింగ్ కూడా లేదు.

మారుతి ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఫీచర్స్
మారుతి ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. పవర్ స్టీరింగ్, టెయిల్‌గేట్ ఓపెనర్, వెనుక డోర్ల కోసం చైల్డ్ లాక్ సేఫ్టీ ఫీచర్ మరియు లోపలి వైపు నుంచే సర్దుబాటు చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్ (కుడివైపు మాత్రమే) వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి విఎక్స్ఐ వేరియంట్ ఫీచర్స్
మారుతి విఎక్స్ఐ వేరియంట్‌లో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. సిడి, రేడియో, యూఎస్‌బితో కూడిన ఆడియో ప్లేయర్, రెండు స్పీకర్లు, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, హెడ్‌ల్యాంప్ బజర్ వార్నింగ్, టాకోమీటర్, డిజిటల్ క్లాక్, రియర్ పార్సిల్ ట్రే, వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మారుతి విఎక్స్ఐ (ఆప్షనల్) వేరియంట్ ఫీచర్స్
మారుతి విఎక్స్ఐ (ఆప్షనల్) వేరియంట్‌లో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో ఇదే టాప్-ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్‌లో సైతం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) సిస్టమ్ లేకపోవటం విచారకరం.

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్ పెట్రోల్ వెర్షన్ కారు లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త మారుతి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి.

సెలెరియో మాదిరిగా కొత్త ఆల్టో కె10 కూడా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. బహుశా ఇది టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండే ఆస్కారం ఉంది.

కొత్త 2014 మారుతి ఆల్టో కె10కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








