కొత్త మారుతి ఆల్టో కె10 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

By Ravi

భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న చిన్న కారు ఆల్టో బ్రాండ్‌లో రెండేళ్ల క్రితం కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను (800సీసీ వెర్షన్) ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తాజాగా ఇదే బ్రాండ్‌లో లభిస్తున్న ఆల్టో కె10 (1000సీసీ వెర్షన్)లో ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది.

కొత్త 2012 ఆల్టో 800 మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ 2014 ఆల్టో కె10 కారును డిజైన్ చేశారు. కేవలం రూ.3.06 లక్షలు (బేస్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర) ప్రారంభ ధరకే మారుతి సుజుకి ఈ కారును విక్రయిస్తోంది.

ఆల్టో 800 మోడల్‌లోని అనేక డిజైన్ అంశాలు, ఫీచర్లను ఈ కొత్త ఆల్టో కె10 మోడల్ లోను గమనించవచ్చు. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో పాటుగా మొట్టమొదటి సారిగా ఏఎమ్‌టితో కూడా లభ్యం కానుంది.

మరి ఈ కొత్త మారుతి ఆల్టో కె10 మోడల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కొత్త మారుతి ఆల్టో కె10 ఫీచర్లు

తర్వాతి స్లైడ్‌లలో కొత్త ఆల్టో కె10 మోడల్‌కు సంబంధించిన ఫీచర్లు, వివరాలను తెలుసుకోండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త ఆల్టో కె10 ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, దీనికి ఆల్టో 800 డిజైన్‌కి మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఇందులో సరికొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్, 2-లైన్ క్రోమ్ గ్రిల్, స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, రౌండ్ ఫాగ్‌ల్యాంప్స్ మరియు పెద్ద ఎయిర్‌డ్యామ్‌లను ఇందులో చూడొచ్చు.

సైడ్ డిజైన్

సైడ్ డిజైన్

దీని సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇది చూడటానికి ఆల్టో 800 మాదిరిగానే అనిపిస్తుంది. ఇందులో బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

కొత్త ఆల్టో వెనుక డిజైన్‌ను చూస్తే, ఇది ఇంచు మించు ఆల్టో 800 మందిరిగానే అనిపిస్తుంది. బంపర్‌ను కొద్దిగా రీడిజైన్ చేశారు. ఇందులో కాంబినేషన్ టెయిల్ ల్యాంప్స్‌ను చూడొచ్చు. ఇంకా ఇందులో హై-మౌంట్ బ్రేక్ ల్యాంప్ ఉంటుంది.

కొలతలు

కొలతలు

* పొడవు : 3,545 మి.మీ.

* వెడల్పు : 1,490 మి.మీ.

* ఎత్తు : 1,475 మి.మీ.

* వీల్‌బేస్ : 2,360 మి.మీ.

* గ్రౌండ్ క్లియరెన్స్ : 160 మి.మీ.

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 35 లీటర్లు

* టర్నింగ్ రేడియస్ : 4.6 మీటర్లు

* బూట్ స్పేస్ : 177 లీటర్లు

ఇంటీరియర్

ఇంటీరియర్

కొత్త ఆల్టో కె10 ఇంటీరియర్స్‌ని సింపుల్ అండ్ క్లీన్‌గా డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ బీజ్ డ్యాష్‌బోర్డ్, అక్కడక్కడా సిల్వర్ ఇన్‌సెర్ట్స్‌తో స్పోర్టీగా, విశాలంగా ఉండేలా దీని ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు.

బీజ్ కలర్ సీట్స్

బీజ్ కలర్ సీట్స్

ప్రీమియం లుక్‌నిచ్చేందుకు ఇందులో బీజ్ కలర్ సీట్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. డోర్స్‌పై కూడా బీజ్ ఇన్‌సెర్ట్స్ కనిపిస్తాయి.

ఆడియో సిస్టమ్

ఆడియో సిస్టమ్

పియానో బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఆడియో సిస్టమ్‌ను కొత్త ఆల్టో కె10లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆడియో సిస్టమ్ సిడి, యూఎస్‌బి, ఆక్స్, రేడియో ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

స్టీరింగ్ వీల్

స్టీరింగ్ వీల్

కొత్త ఆల్టో కె10లో 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను ఆఫర్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ మధ్యలో క్రోమ్ సుజుకి లోగో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్ ఆల్టో కె10లో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్ లభిస్తుంది.

స్పీడోమీటర్ క్లస్టర్

స్పీడోమీటర్ క్లస్టర్

ఆల్టో కె10 స్పీడోమీటర్ క్లస్టర్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. ఓ వైపు ఆర్‌పిఎమ్ మీటర్ మధ్యలో స్పీడోమీటర్ మరో వైపు ఇండికేటర్ లైట్స్ ఉంటాయి. మధ్యలో ఓ డిజిటల్ ఫ్యూయెల్ ఇండికేటర్ కూడా ఉంది. ఇది ట్రిప్ మీటర్‌గా కూడా పనిచేస్తుంది.

సెంటర్ స్టోరేజ్ బాక్స్

సెంటర్ స్టోరేజ్ బాక్స్

ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మొబైల్స్, గాడ్జెట్స్, గాగుల్స్ వంటి వాటిని ఉంచుకోవచ్చు. ఈ సెంటర్ కన్సోల్‌కు ఓ 12-వోల్ట్ పవర్ సాకెట్ కూడా ఉంటుంది.

డ్యూయెల్ కప్ హోల్డర్

డ్యూయెల్ కప్ హోల్డర్

బీజ్ కలర్‌లో ఉండే ఈ ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో రెండు కప్ హోల్డర్లు కూడా ఉంటాయి. కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్స్ వంటి వాటిని ఇందులో ఉంచుకోవచ్చు.

ఫ్రంట్ పవర్ విండోస్

ఫ్రంట్ పవర్ విండోస్

ఆల్టో కె10 ఫ్రంట్ పవర్ విండోస్‌తో లభిస్తుంది. ఈ పవర్ విండో స్విచ్‌లో ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌పై గేర్ బాక్స్‌కు వెనుకగా ఉంటాయి.

ఏసి లోవర్స్

ఏసి లోవర్స్

కారులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేసేందుకు గాను ఏసి వెంట్స్‌కు లోవర్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఏసిని కంట్రోల్ చేసుకోవచ్చు.

ఐపి అప్పర్ ట్రే

ఐపి అప్పర్ ట్రే

చిన్న చిన్న వస్తువులను దాచుకునేందుకు డ్యాష్‌బోర్డుపై సెంటర్ ఏసి వెంట్స్‌కు పక్కన ఓ చిన్న ట్రేని అందిస్తున్నారు.

ఇంటర్నల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్

ఇంటర్నల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్

కొత్త ఆల్టో కె10 కారులోని సైడ్ మిర్రర్స్‌ను లోపలి వైపు నుంచే సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందుకోసం ఇరువైపులా జాయ్ స్టిక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఐపి హుక్

ఐపి హుక్

క్యారీ బ్యాగ్స్ వంటి వాటిని తగిలించుకునేందుకు వీలుగా ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ డ్యాష్ బోర్డులో ఓ హుక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

రియర్ కన్సోల్ బాటిల్ హోల్డర్

రియర్ కన్సోల్ బాటిల్ హోల్డర్

హ్యాండ్ బ్రేక్‌కు వెనుకగా ఉండే రియర్ కన్సోల్‌పై ఓ బాటిల్ హోల్డర్ ఉంటుంది. ఇందులో లీటర్ వాటిల్ బాటిల్‌ను స్టోర్ చేసుకోవచ్చు.

ఇంజన్

ఇంజన్

కొత్త ఆల్టో కె10లో ఇంప్రూవ్డ్ 998సీసీ, 3-సిలిండర్, కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌‌తో పాటుగా, సెలెరియో ద్వారా కొత్తగా పరిచయం చేసిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా ఆఫర్ చేస్తున్నారు.

మైలేజ్

మైలేజ్

మునుపటి ఆల్టో కె10తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆల్టో కె10 మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం.. పెట్రోల్ వెర్షన్ ఆల్టో కె10 లీటరుకు 24.07 (మ్యాన్యువల్ అండ్ ఏఎమ్‌టి) కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో 2015 ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

సేఫ్టీ ఫీచర్స్ - కీలెస్ ఎంట్రీ

సేఫ్టీ ఫీచర్స్ - కీలెస్ ఎంట్రీ

కొత్త ఆల్టో కె10 కీలెస్ ఎంట్రీ ఫీచర్‌తో లభిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో కారును లాక్/అన్‌లాక్ చేయటం చాలా సులువు.

సేఫ్టీ ఫీచర్స్ - ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

సేఫ్టీ ఫీచర్స్ - ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

కొత్త ఆల్టో కె10లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. శీతాకాలం, పొగమంచు ఎక్కువగా ఉండే సమయాల్లో స్పష్టంగా దారిని చూపేందుకు మరియు రోడ్డుపై మంచి కాంతిని అందజేసేందుకు ఇవి సహకరిస్తాయి.

సేఫ్టీ ఫీచర్స్ - డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

సేఫ్టీ ఫీచర్స్ - డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

టాప్-ఎండ్ వేరియంట్ ఆల్టో కె10 డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ఫీచర్ చక్కగా పనికొస్తుంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు:

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు:

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ - రూ.3.06 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ - రూ.3.22 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ - రూ.3.38 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.3.57 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆటోమేటిక్) - రూ.3.80 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.3.82 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

* ట్యాంగో ఆరెంజ్

* సెరులీన్ బ్లూ

* గ్రానైట్ గ్రే

* ఫైర్ బ్రిక్ రెడ్

* సిల్కీ సిల్వర్

* సుపీరియర్ వైట్

Most Read Articles

English summary
Maruti Suzuki India has just launched the all-new Alto K10 at Rs 3.06 lakh (ex-showroom, Delhi). The new Maruti Alto K10 will be available in petrol and CNG fuel options.
Story first published: Tuesday, November 4, 2014, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X