మారుతి సుజుకి సియాజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

By Ravi

మీరు ఓ మంచి మిడ్-సైజ్ సెడాన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే, ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లను మర్చిపోయి హ్యాపీగా మారుతి సుజుకి సియాజ్‌ను కొనుగోలు చేసేయండి. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపుతూ కేవలం రూ.6.99 లక్షల (ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే మారుతి సుజుకి తమ సియాజ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

సియాజ్ కేవలం ధర పరంగానే కాకుండా, మోడ్రన్ ఫీచర్ల పరంగా కూడా ఇతర సెడాన్లతో పోల్చుకుంటే ఎంతో ముందుంటుంది. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ కథనంలో మారుతి సుజుకి సియాజ్ ప్రత్యేకతలను, ఇందులోని విశిష్టమైన ఫీచర్లను, ఇంజన్ సాంకేతిక వివరాలను మరియు ఇతర సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మారుతి సియాజ్ కంప్లీట్ ఫీచర్స్

మారుతి సుజుకి సియాజ్ ఇంజన్, పెర్ఫార్మెన్స్, మైలేజ్, ఫీచర్లు తదితర వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

పెట్రోల్ ఇంజన్, మైలేజ్

పెట్రోల్ ఇంజన్, మైలేజ్

సియాజ్ పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 92.45 పిఎస్‌ల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.73 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ ఇంజన్, మైలేజ్

డీజిల్ ఇంజన్, మైలేజ్

సియాజ్ డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 26.21 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్

ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో లభిస్తుంది. ఈ హెడ్‌లైట్స్ కారు ఓవరాల్ లుక్‌ని పెంచడంలో సహకరించడమే కాకుండా, రాత్రివేళల్లో ప్రకాశవంతమైన కాంతిని కూడా విడుదల చేస్తాయి. సియాజ్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్స్ లేవు.

కాంబినేషన్ టెయిల్ ల్యాంప్

కాంబినేషన్ టెయిల్ ల్యాంప్

ఈ కారు వెనుక భాగంలోని టెయిల్ ల్యాంప్స్‌ను విశిష్టంగా డిజైన్ చేశారు. ఈ టెయిల్ ల్యాంప్ సగ భాగం కారు బూట్ డోరుపై, మిగిలిన సగ భాగం కారు బాడీపై ఉంటాయి. ఇవి నార్మల్ టెయిల్ ల్యాంప్స్ (ఎల్ఈడి లైట్లు కావు) అయినప్పటికీ, ప్రకాశించినప్పుడు ఎల్ఈడి స్టయిల్ లుక్‌నిస్తాయి.

16 ఇంచ్ అల్లాయ్ వీల్స్

16 ఇంచ్ అల్లాయ్ వీల్స్

కొత్త సియాజ్‌లో మల్టీ స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. ఈ పెద్ద చక్రాలు మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేసేందుకు సహకరించడమే కాకుండా, కారుకు మంచి స్టైల్‌ను కూడా అందిస్తాయి.

క్రోమ్ గ్రిల్

క్రోమ్ గ్రిల్

కారు ముందు వైపు బంపర్‌ను, బానెట్‌ను కలుపుతూ ఉండే క్రోమ్ గ్రిల్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ క్రోమ్ గ్రిల్ మధ్యలో సుజుకి బ్రాండింగ్ బ్యాడ్జ్ ఉంటుంది.

ఏరోడైనమిక్ షేప్

ఏరోడైనమిక్ షేప్

ఎస్ఎక్స్-4 స్థానాన్ని రీప్లేస్ చేస్తూ మారుతి ప్రవేశపెట్టిన ఈ సియాజ్ సెడాన్ ఏరోడైనమిక్స్ షేప్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకించి దీని బాడీ లైన్స్ అందంగా కనిపిస్తాయి.

ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

సియాజ్ ఇంటీరియర్స్‌ని చాలా నీట్ అండ్ క్లీన్‌గా క్రాఫ్ట్ చేశారు. ఇందులో ముందు సీట్లలో కూర్చునే వారి కోసం ఆర్మ్ రెస్ట్‌ను ఏర్పాటు చేశారు. లాంగ్ డ్రైవ్‌లలో ఇది చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.

రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

ముందు సీట్లలో కూర్చునే వారి కోసమే కాకుండా వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా సెంటర్ ఆర్మ్ రెస్ట్‌ను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రెండు బాటిళ్లను స్టోర్ చేసుకునేలా కప్ హోల్డర్లను కూడా ఏర్పాటు చేశారు.

రివర్స్ పార్కింగ్ కెమెరా

రివర్స్ పార్కింగ్ కెమెరా

సియాజ్ రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో లభిస్తుంది. బూట్ డోర్ క్రింది భాగంలో ఎడమవైపుగా ఈ కెమెరా అమర్చబడి ఉంటుంది.

రివర్స్ పార్కింగ్ డిస్‌ప్లే

రివర్స్ పార్కింగ్ డిస్‌ప్లే

కారు వెనుక భాగంలో అమర్చిన రివర్స్ పార్కింగ్ కెమెరా బయటి దృశ్యాలను క్యాప్చూర్ చేసి, కారు లోపల ఉన్న ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌పై ప్రొజెక్ట్ చేస్తుంది. పార్కింగ్‌ను సులభతరం చేసేందుకు ఇది సహకరిస్తుంది.

ఇంజన్ స్టార్ట్/స్టాప్

ఇంజన్ స్టార్ట్/స్టాప్

కొత్త సియాజ్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్‌తో లభిస్తుంది. కారును స్టార్ట్ చేయటానికి తాళం చెవిని ఇగ్నిషన్‌లో ఉంచాల్సిన అవసరం లేకుండానే ఈ బటన్ సాయంతో ఇంజన్‌ను ఆన్ చేయటం లేదా ఆఫ్ చేయటం చేయవచ్చు.

స్మార్ట్ కీ

స్మార్ట్ కీ

లగ్జరీ కార్లలో లభించే స్మార్ట్ కీ ఫీచర్ సిస్టమ్‌ను సియాజ్‌‌లోని ఆఫర్ చేస్తున్నారు. ఈ కీని కేవలం జేబులో ఉంచుకొని, డ్రైవర్ సీటులో కూర్చుంటే చాలు ఇంజన్ ఆన్ చేయటం లేదా ఆఫ్ చేయటం చాలా సులువు అవుతుంది.

స్టీరింగ్‌పై కంట్రోల్స్

స్టీరింగ్‌పై కంట్రోల్స్

మారుతి సియాజ్‌లోని 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఆడియో సిస్టమ్‌ను కంట్రోల్ చేసేందుకు స్విచ్‌లతో పాటుగా, టెలిఫోన్ కంట్రోల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాల్స్‌ను ఆన్సర్ చేయటం, రిజెక్ట్ చేయటం చేయవచ్చు.

ఆడియో సిస్టమ్

ఆడియో సిస్టమ్

సిడి, ఎఫ్ఎమ్, బ్లూటూత్, ఎమ్‌పి3 కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్‌ను సియాజ్‌లో ఆఫర్ చేస్తున్నారు.

ఆటో ఏసి

ఆటో ఏసి

ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ లభిస్తుంది. ఇది కారులోని ఉష్ణోగ్రతలను బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా నియంత్రిస్తూ ఉంటుంది.

విశాలమైన స్పేస్

విశాలమైన స్పేస్

సియాజ్ ఇంటీరియర్‌ను ఇండియన్ పరిస్థితులకు అనుగుణంగా విశాలంగా డిజైన్ చేశారు. ఇందులోని ఫ్రంట్ సీట్లకే కాకుండా వెనుక సీట్లలో కూడా విశాలమైన లెగ్‌రూమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రియర్ సన్‌షేడ్

రియర్ సన్‌షేడ్

కొత్త సియాజ్‌లో కర్టెన్ టైప్ రియర్ సన్‌షేడ్‌ను ఆఫర్ చేస్తున్నారు. కార్లకు సన్‌ఫిల్ముల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో, ఈ కర్టెన్ సన్‌షేడ్ వేసవి కాలంలో చక్కగా ఉపయోగపడనుంది.

రియర్ ఏసి వెంట్స్, చార్జింగ్ పోర్ట్

రియర్ ఏసి వెంట్స్, చార్జింగ్ పోర్ట్

కారు వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులకు కూడా ఏసి వచ్చేలా ఫ్రంట్ సీట్లకు మధ్యలో రియర్ ఏసి వెంట్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏసి వెంట్స్‌కు క్రింది భాగంలో 12 వోల్ట్ చార్జింగ్ పోర్ట్‌ను కూడా అమర్చారు. దీని సాయంతో మొబైల్స్ వంటి గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకోవచ్చు.

రియర్ రీడింగ్ ల్యాంప్స్

రియర్ రీడింగ్ ల్యాంప్స్

వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకుల సౌకర్యార్థం సైడ్ డోరుకు పైభాగంలో ఇండివిడ్యువల్ రీడింగ్ ల్యాంప్స్‌ను కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

కొన్ని పెట్రోల్ వెర్షన్ మరియు అన్ని డీజిల్ వెర్షన్ సియాజ్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభిస్తాయి.

ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్

ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్

పెట్రోల్ వెర్షన్ సియాజ్‌లోని రెండు వేరియంట్లు మాత్రం 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు.

డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్

డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్

డ్రైవర్, ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

రియర్ పార్కింగ్ సెన్సార్

రియర్ పార్కింగ్ సెన్సార్

సురక్షితమైన పార్కింగ్ కోసం మరియు కారు వెనుక భాగంలో అడ్డంకిగా ఉన్న వస్తువుల గురించి డ్రైవరును అప్రమత్తం చేసేందుకు గాను సియాజ్ వెనుక భాగంలో రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

ధృడమైన బాడీ

ధృడమైన బాడీ

ప్రమాద తాకిడి సమర్థవంతంగా ఎదుర్కునేందుకు గాను సియాజ్ బాడీని సుజుకి టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ (స్టెక్ట్) సాయంతో హై టెన్సైల్‌తో నిర్మించారు.

ఏబిఎస్-ఈబిడి

ఏబిఎస్-ఈబిడి

సియాజ్ ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సినప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

యుటిలిటీ స్పేస్

యుటిలిటీ స్పేస్

కొత్త సియాజ్ సెడాన్‌లో యుటిలిటీ స్పేస్‌ను చక్కగా ప్లాన్ చేశారు. ఇన్‌సైడ్ డోర్స్‌లో బాటిల్ హోల్డర్లను ఆఫర్ చేస్తున్నారు.

యుటిలిటీ స్పేస్

యుటిలిటీ స్పేస్

మ్యాగజైన్స్, బుక్స్, న్యూస్ పేపర్స్ వంటి వాటిని స్టోర్ చేసుకునేందుకు ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

యుటిలిటీ స్పేస్

యుటిలిటీ స్పేస్

సెంటర్ కన్సోల్‌లో కూడా యుటిలిటీ స్పేస్‌ను చక్కగా ప్లాన్ చేశారు. ఇందులో కూడా బాటిలో హోల్డర్ ఉంటుంది.

యుటిలిటీ స్పేస్

యుటిలిటీ స్పేస్

వాలెట్ వంటి వస్తువులను దాచుకునేందుకు ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ క్రింది భాగంలో కొంత యుటిలిటీ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు.

యుటిలిటీ స్పేస్

యుటిలిటీ స్పేస్

కూలింగ్ గ్లాసెస్ వంటి వాటిని స్టోర్ చేసుకునేందుకు ఫ్రంట్ క్యాబిన్ లైట్స్ వద్ద యుటిలిటీ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

మారుతి సుజుకి సియాజ్ 510 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోమాగ్నటిక్ లాచ్ అండ్ బూట్ లైట్ ఉంటాయి.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

మారుతి సియాజ్ పెరల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, పెరల్ సంగ్రియా రెడ్, పెరల్ స్నో, వైట్, మెటాలిక్ క్లియర్ బీజ్, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, మెటాలిక్ సిల్కీ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

పెట్రోల్ వేరియంట్లు - ధరలు:

పెట్రోల్ వేరియంట్లు - ధరలు:

1. సియాజ్ వి - రూ.6.99 లక్షలు

2. సియాజ్ వి+ - రూ.7.55 లక్షలు

3. సియాజ్ జెడ్ - రూ.8.24 లక్షలు

4. సియాజ్ జెడ్ (ఆప్షనల్) - రూ.8.59 లక్షలు

5. సియాజ్ వి ఆటోమేటిక్ - రూ.8.65 లక్షలు

6. సియాజ్ జెడ్ ఆటోమేటిక్ - రూ.9.34 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వేరియంట్లు - ధరలు:

డీజిల్ వేరియంట్లు - ధరలు:

7. సియాజ్ వి - రూ.8.04 లక్షలు

8. సియాజ్ వి+ - రూ.8.63 లక్షలు

9. సియాజ్ జెడ్ - రూ.9.45 లక్షలు

10. సియాజ్ జెడ్ (ఆప్షనల్) - రూ.9.80 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, October 7, 2014, 14:23 [IST]
English summary
Maruti Suzuki India has finally launched the much-awaited Ciaz at a starting price tag of Rs 6.99 lakh (ex-showroom Delhi). Take a look at the Features of the Ciaz sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+