ఫిబ్రవరి 11న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డీజిల్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సెడెస్ బెంజ్ ఇండియా, గడచిన సంవత్సరం నవంబర్ నెలలో అప్‌గ్రేడెడ్ వెర్షన్ సి-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్పట్లో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే సి-క్లాస్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. కాగా.. ఇందులో కొత్త డీజిల్ వెర్షన్‌ను ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ లగ్జరీ కార్ ఎస్-క్లాస్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది కొత్త 2014 సి-క్లాస్‌ను డిజైన్ చేశారు. ఈ కొత్త సి-క్లాస్ కారును కొత్త లైట్‌వెయిట్ మాడ్యులర్ రియర్-డ్రైవ్ ఎమ్ఆర్ఏ (మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ కన్నా తేలికగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇందులో ఇంటీరియర్ స్పేస్ అధికంగా ఉంటుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మొత్తం 4686 మి.మీ. పొడవును 1810 మి.మీ. వెడల్పును మరియు 1442 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ప్రస్తుత వెర్షన్ సి-క్లాస్‌తో పోల్చి చూస్తే ఇది 95 మి.మీ. ఎక్కువ పొడవును, 40 మి.మీ. ఎక్కువ వెడల్పును మరియు 5 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త సి-క్లాస్ వీల్‌బేస్ 2840 మి.మీ., మునుపటి వెర్షన్ కన్నా ఇది 80 మి.మీ. అధికం.
అడాప్టివ్ మెయిన్ బీమ్ అసిస్ట్ ప్లస్‌తో కూడిన ఫుల్ ఎల్ఈడి ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్‌ను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-సేఫ్, అటెన్షన్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్‌పి, ఏఎస్ఆర్, బిఏఎస్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.


Click it and Unblock the Notifications








